ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిలుక దివ్యదృష్టి

ABN, Publish Date - Jul 10 , 2024 | 12:33 AM

అక్బర్‌ చక్రవర్తికి ఒక ప్రియమైన ఉంగరం ఉండేది. రోజూ రాత్రి ఆ ఉంగరాన్ని వేలి నుండి తీసి పక్కన పెట్టి ఉదయం మళ్లీ చేతికి పెట్టుకోవటం చక్రవర్తికి అలవాటు. ఒక ఉదయం అక్బర్‌ చక్రవర్తి నిద్ర లేచేసరికి ఎదురుగా...

అక్బర్‌ చక్రవర్తికి ఒక ప్రియమైన ఉంగరం ఉండేది. రోజూ రాత్రి ఆ ఉంగరాన్ని వేలి నుండి తీసి పక్కన పెట్టి ఉదయం మళ్లీ చేతికి పెట్టుకోవటం చక్రవర్తికి అలవాటు. ఒక ఉదయం అక్బర్‌ చక్రవర్తి నిద్ర లేచేసరికి ఎదురుగా కనిపించాల్సిన ఉంగరం మాయమైంది. తన గదిలో ఎంత వెదికినా ఉంగరం కనపడలేదు. ఎవరు తీశారో కనుక్కోవాలని వెంటనే రాజభక్తులను పిలిపించారు అక్బర్‌. కోపంతో.. ‘ఈ తలుపులు మూసేసి.. పని వారందరినీ లోపలే ఉండమని చెప్పండి’ అని హుకుం జారీ చేశాడు రాజుగారు. ఆ వెంటనే బీర్బల్‌కు కబురు పంపారు.


బీర్బల్‌ వస్తూ వస్తూ ఓ చిలుకను తీసుకొచ్చారు. ఆ చిలుకను చూడగానే.. ‘చిలుక జోతిష్యం చెప్పడానికి మిమ్మలను రమ్మన్నాన’ అంటూ కోపంతో మాట్లాడారు అక్బర్‌. బీర్బల్‌ మెల్లగా.. ‘జహాపనా.. ఈ చిలుక దివ్యదృష్టి కలది. మీ ఉంగరం ఎవరు తీశారో ఇది కనిపెట్టి గాల్లోకి లేచి దొంగ దొంగ.. అని అరుస్తుంది’ అని చెప్పాడు. బీర్బల్‌ తన చేత్తో చిలుక తలమీద నిమిరాడు. అది రెక్కలు టపటపలాడిస్తూ దొంగ దొంగ.. అని అరిచింది గాల్లోకి వెళ్లి. ఆ అరుపులు విని అక్కడి పనివాడు ఒకడు మెల్లగా జారుకోవటానికి ప్రయత్నించాడు. ‘ఇదిగో మీరు వెతుకుతున్న దొంగ’ అని ఆ దొంగను అప్పగించాడు బీర్బల్‌. అక్బర్‌ ఆశ్చర్యపోయారు. ‘ఈ చిలుకకు దివ్యదృష్టి ఎలా వచ్చింది’ అంటూ ఆసక్తితో అడిగారు. ‘మరేం లేదు మహారాజా.. ఈ చిలుకకు దొంగ.. అనే మాట మాత్రమే నేర్పించాను. నిజంగా దొంగతనం చేసినవాడు తనను చూసి అరుస్తుందేమోనని అనుకుంటాడు. భయంతో తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. అందుకే సులువుగా పట్టుకోగలిగాం’అని జవాబు చెప్పాడు బీర్బల్‌. ఆ చమత్కారానికి అక్బర్‌ మనసారా నవ్వుకున్నారు. బీర్బల్‌కు మంచి బహుమానాలు ఇచ్చారు.

Updated Date - Jul 10 , 2024 | 12:33 AM

Advertising
Advertising
<