Baby Care : శిశువులకు కాలుష్యం ప్రమాదమే!
ABN, Publish Date - Jul 01 , 2024 | 11:42 PM
అప్పుడే పుట్టిన పసిపాపలు గాజుబొమ్మల లాంటివారు. వారిని అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సార్లు పిల్లలకు కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువ! ఈ సమస్యలకు సంబంధించిన విషయాలను
అప్పుడే పుట్టిన పసిపాపలు గాజుబొమ్మల లాంటివారు. వారిని అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సార్లు పిల్లలకు కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువ! ఈ సమస్యలకు సంబంధించిన విషయాలను మెడికవర్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ పిడియాట్రిషియన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి పరిగె- ‘డాక్టర్’కు వివరించారు.
పిల్లలలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ సమస్యలు ఏమిటి?
పిల్లలు శ్వాస పీల్చుకొనే సమయంలో శబ్దం చేస్తున్నా.. శ్వాస పీల్చుకోనే గుండె దగ్గర ఉన్న కండరాలు ఎక్కువగా కదులుతూ ఇబ్బంది పెడుతు న్నా.. వారికి సమస్య ఉందని గుర్తించి వెంటనే చికిత్స అందిస్తాం. సాధారణంగా ఒక బేబీ పుట ్టడానికి 40 వారాలు పుడుతుంది. 34 వారాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు పుడితే వారికి శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మన చుట్టూ ప్రపంచంలో కాలుష్యం బాగా పెరిగిపోతుంది.. దీని ప్రభావం నవజాత శిశువులపై ఎలా ఉంటుంది?
బిడ్డ కడుపులో ఉండగా తల్లులు పొగ త్రాగితే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ మధ్య జరిగిన అధ్యయనాలలో- తక్కువ బరువున్న పిల్లలు నెలలు నిండకుండా పుట్టడానికీ.. కాలుష్యానికి నేరుగా సంబంధం ఉందని తేలింది. తల్లులు కాలుష్యం బారిన పడినప్పుడు అబార్షన్స్ కూడా జరిగే అవకాశ ముంది. ప్రపంచంలో పది మంది పిల్లలు పుడితే వారిలో ఒకరు పూర్తిగా ఎదగకుండా పుడతారు. అలాంటి వారికి చికిత్స అవసరమవుతుంది.
తక్కువ బరువు ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువంటున్నారు కదా..వారిని రక్షించటానికి అవసరమైన వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయా?
నవజాత శిశువులను రక్షించటానికి అనేక పరికరాలు, ట్రీట్‌మెంట్స్, ప్రొటోకాల్స్ అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు సాధారణంగా ఒక బేబీ పుట్టినప్పుడు 2 నుంచి మూడు కేజీల వరకూ ఉంటుంది. కొన్ని సార్లు పూర్తిగా ఎదగకుండానే పిల్లలు పుడుతూ ఉంటారు. ఉదాహరణకు ఈ మధ్యనే మా దగ్గర 24 వారాలు ఎదిగిన ఒక బేబీ పుట్టింది. ఈ పసికూన బరువు 500 గ్రాములు. ఇలాంటి వారిని జాగ్రత్తగా పెంచటానికి కొన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు. కొత్త కొత్త మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు అప్పుడే పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తులు సరిగ్గా ఎదగవు. అవి సరిగ్గా ఎదగటానికి ఒక ప్రత్యేకమైన ఇంజక్షను ఉంది. దీనిని నేరుగా ఉపిరితిత్తులకే ఇస్తాం. దీని వల్ల పిల్లల ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తాయి.
తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు ఉన్న అన్ని సమస్యలు తెలిసిపోతాయా?
అత్యాధునికమైన అలా్ట్ర సౌండ్ పద్ధతిలో పిల్లల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయం తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఫీటల్ మెడిసెన్ అనే ప్రత్యేక విభాగం అభివృద్ధి చెందింది. దీని ద్వారా గర్భస్త శిశువుకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని పుట్టక ముందే తెలుసుకోగలుగుతాం. ఒక సారి ఏదైనా ఆరోగ్య సమస్య ఉందనే విషయం తెలిస్తే- బిడ్డ పుట్టిన వెంటనే తగిన వైద్యాన్ని అందించటానికి సిద్ధంగా ఉంటాం. ఉదాహరణకు ఒక బిడ్డకు సమస్య ఉందనే విషయాన్ని గైనకాలిజిస్ట్ కనుగొన్నారనుకుందాం. అప్పుడు కడుపులో ఉన్న బిడ్డ లంగ్స్ బలోపేతం అవటానికి వీలుగా తల్లికి కొన్ని స్టిరాయిడ్స్ ఇస్తారు. ఇలాంటి చికిత్సలతో పాటుగా- ఈ మధ్య కాలంలో అత్యాధునికమైన వెంటిలేటర్లు, పిల్లలకు ఏ మాత్రం అసౌకర్యం కల్గించని విధంగా ఉండే పరికరకాలు అందుబాటులోకి వచ్చాయి.
పిల్లలకు ఎలాంటి జన్యుపరమైన సమస్యలు ఏర్పడతాయి?
జన్యుపరమైన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇది వరకు జన్యువుల వల్ల వచ్చే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే సమస్య విదేశాలలో ఎక్కువగా కనిపించేది. ఈ సమస్య ఉన్న వారిలో ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయవు. ఈ మధ్యకాలంలో మన దగ్గర కూడా ఇలాంటి కొన్ని కేసులు వస్తున్నాయి.
పూర్తిగా ఎదగని బేబీలను పెంచి వారిని ఆరోగ్యంగా ఇంటికి పంపినప్పుడు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. సాధారణంగా పుట్టిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ తర్వాత వారికి ఎటువంటి సమస్యలు రావు.
పుట్టిన బిడ్డలతో పాటుగా వారి తల్లులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత తల్లులు విపరీతమైన ఒత్తిడితో ఉంటారు. బిడ్డకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందని తెలిస్తే- ఆ ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. అందువల్ల వారికి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
డాక్టర్ రవీందర్‌రెడ్డి పరిగె
హెచ్‌ఓడీ, నియోనెటాలజీ మరియు పీడియాట్రిక్స్,
మెడికవర్ హాస్పిటల్, హైదరాబాద్
Updated Date - Jul 01 , 2024 | 11:42 PM