కష్టానికి గుర్తింపు

ABN, Publish Date - Jul 31 , 2024 | 06:08 AM

ఒక ఊరిలో గోపయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతనికి ఏ పని అప్పజెప్పినా, ఎంతో శ్రధ్దగా నిజాయితీగా అంకితభావంతో చేస్తాడని మంచి పేరుండేది. ఒక రోజు ఆ ఊరి జమీందారు తన పడవకు...

కష్టానికి గుర్తింపు

ఒక ఊరిలో గోపయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతనికి ఏ పని అప్పజెప్పినా, ఎంతో శ్రధ్దగా నిజాయితీగా అంకితభావంతో చేస్తాడని మంచి పేరుండేది. ఒక రోజు ఆ ఊరి జమీందారు తన పడవకు రంగులు వేయమని గోపయ్యను పిలిపించాడు. జమీందారు ఇచ్చిన రంగులు తీసుకుని, పడవ దగ్గరికి వెళ్లిన గోపయ్యకు ఆ పడవకు రంధ్రం కనిపించింది. దాన్ని పూడ్చకుండా రంగులు వేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు ఆ చిల్లును పూడ్చి ఆ తర్వాత రంగులు వేసాడు. జమీందారు ఆ మర్నాడు గోపయ్యను వచ్చి డబ్బు తీసుకెళ్లమని చెప్పి పంపేసాడు. ఆ రోజు జమీందారు ఒక ఊరికి, అతని కుటుంబ సభ్యులు మరో ఊరికి వెళ్లవలసి వచ్చింది. సాయంత్రం జమీందారు పొరుగూరినుండి తిరిగి వచ్చేసరికి తనత కుటుంబం కొత్తగా రంగులు వేసిన పడవలో నది అవతల ఊరికి వెళ్లారని తెలిసి, జమీందారు ఎంతో కంగారుగా నది వద్దకు పరిగెత్తుకుని వచ్చి పడవకు పడిన రంధ్రం గురించి అడిగాడు.


అది చక్కగా మూసివేసిఉండటం గమనించి, గోపయ్యను పిలాచాఅడగగా, గోపయ్య తానే ఆ రంధ్రాన్ని మూసివేసి, ఆ తరువాతే పడవకు రంగులు వేసానని చెప్పాడు, అదివిన్న జమీందారు ‘నేను చెప్పిన పనితో పాటు చెప్పని పని కూడా చేసిపెట్టి, ఈ రోజు నాకుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడావు గోపయ్యా’ అని మెచ్చుకొని, ముందు మాట ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు గోపయ్యకు ఇచ్చి ‘ఇది నీ మంచిమనసుకు, పడిన కష్టానికి గుర్తింపు అనుకో’ అని చెప్పాడు.

Updated Date - Jul 31 , 2024 | 06:08 AM

Advertising
Advertising
<