ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చర్మం కోమలంగా!

ABN, Publish Date - Sep 25 , 2024 | 11:19 PM

30 ఏళ్ల నుంచి చర్మం బిగుతును కోల్పోవడం మొదలుపెడుతుంది. కొత్త చర్మ సమస్యలు కూడా ఆ వయసు నుంచే మొదలవుతాయి. వీటిని దూరం చేసుకోవాలంటే కొన్ని చర్మ చికిత్సలు, జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలి.

30 ఏళ్ల నుంచి చర్మం బిగుతును కోల్పోవడం మొదలుపెడుతుంది. కొత్త చర్మ సమస్యలు కూడా ఆ వయసు నుంచే మొదలవుతాయి. వీటిని దూరం చేసుకోవాలంటే కొన్ని చర్మ చికిత్సలు, జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలి.

క్లీనింగ్‌: మాయిశ్చరైజర్‌ వల్ల చర్మం తేమగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే అంతకంటే ముందు చర్మం మీద పేరుకునే మృతకణాలను తొలగించుకోవాలి. ఇందుకోసం రోజు విడిచి రోజు మెత్తని బియ్యం పిండి, నిమ్మరసం, తేనె, పెరుగు మిశ్రమంతో ముఖ చర్మాన్ని కొద్దిసేపు మర్దన చేసి కడిగేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని తువ్వాలుతో తుడుచుకుని, మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి.

తేమగా: చర్మానికి తేమ అవసరం. ఇది వ్యక్తికీ, వ్యక్తికీ, కాలానికీ మారుతూ ఉంటుంది. పొడిచర్మం కలిగిన వాళ్లు నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌, జిడ్డుచర్మం కలిగినవాళ్లు ఆయిల్‌ బేస్‌డ్‌ మాయిశ్చరైజర్‌ వాడుకోవాలి. వీలైతే మీగడ, తేనె, నిమ్మరసం మిశ్రమం ముఖానికి పూసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా ప్రతి మూడు రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి.

ఎక్స్‌ఫోలియేట్‌: చర్మం మెరుపులీనాలంటే మృత కణాలు తొలగించాలి. ఇందుకు తగిన సమయం రాత్రివేళ. అయితే ముఖం మీద మొటిమలు ఉన్నా, చర్మం కంది ఉన్నా ఎక్స్‌ఫోలియేట్‌ చేయకూడదు. దీనికి బదులుగా సెనగపిండి, పాలు, గులాబీ నీళ్లు కలిపిన మిశ్రమం ముఖం మీద పూసుకుని, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.

సన్‌స్ర్కీన్‌: సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేస్తాయి. వీటి నుంచి కాపాడుకోవడానికి సన్‌స్ర్కీన్‌ వాడడం తప్పనిసరి. అయితే ఎండ తీవ్రత ఉన్నా, లేకపోయినా, సూర్యకిరణాలు సోకడం వల్ల చర్మం రంగుమారడం ఆగదు. కాబట్టి సన్‌స్ర్కీన్‌ లోషన్‌ వాడడం తప్పనిసరి.

నిద్రకు ముందు: నిద్రకు ముందు వేసుకున్న మేకప్‌ పూర్తిగా తొలగించాలి. లేదంటే ఉదయానికి కళ్లు ఎర్రగా మారతాయి, ముఖం మీద మొటిమలూ తలెత్తుతాయి. చర్మానికి గాలి సోకి, పునరుజ్జీవం పొందేలా రాత్రి నిద్రకు ముందు క్లీన్సర్‌ లేదా మేకప్‌ రిమూవర్‌తో మేకప్‌ పూర్తిగా తొలగించుకోవాలి. స్వచ్ఛమైన కొబ్బరినూనెతో మేకప్‌ తొలగించడం అన్ని విధాలా ఉత్తమం.

వ్యాయామం: చర్మం యవ్వనంగా ఉండాలంటే క్రమంతప్పక వ్యాయామం చేయాలి. రక్తప్రసరణ మెరుగైతే చర్మం మెరుపులీనుతూ ఉంటుంది. వ్యాయామంతో వెలువడే స్వేదంతో చర్మరంథ్రాలు శుభ్రపడతాయి. వ్యాయామంతో మనసును హుషారుగా ఉండే హార్మోన్లు కూడా సరిపడా విడుదల అవుతాయి. కాబట్టి రోజులో కనీసం 30 నుంచి 40 నిమిషాలపాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

కాలుష్యం: వాతావరణ కాలుష్యం చర్మ సమస్యలకు మూలం. కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ ఎండకు, దుమ్ము, ఽధూళి నుంచి చర్మానికి రక్షణ కల్పించుకోవాలి. ఇందుకోసం ముఖానికి మాస్క్‌లు ధరించవచ్చు. స్కార్ఫ్‌తో కప్పి ఉంచుకోవచ్చు. వీలైనంత వరకూ గొడుగు వాడాలి. వాహనాల మీద ప్రయాణం చేసేవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. స్కార్ఫ్‌తోపాటు, చలువ కళ్లద్దాలు తప్పనిసరిగా ధరించాలి.

Updated Date - Sep 25 , 2024 | 11:19 PM