Clothes : దుస్తులు రంగు వెలిసిపోతుంటే ఇలా చేసి చూడండి.. ఫలితం ఖాయం..!
ABN, Publish Date - Apr 01 , 2024 | 02:00 PM
చాలా వరకూ ఇష్టపడి కొనుక్కు దుస్తులు రంగు మారిపోయాయంటే ఇబ్బంది పడతారు. రంగు పోతుందంటే అస్సలు ఆ డ్రస్, చీర కొనేందుకు ముందే ఆలోచిస్తాం. వాషింగ్ మిషన్ లో వేసేప్పుడు ఉతికే సామర్థ్యానికంటే కూడా ఎక్కువ దుస్తులు వేసి ఉతికేస్తూ ఉంటాం కానీ ఇది కూడా రంగుపోయేలా చేస్తుంది.
చాలా వరకూ ఇష్టపడి కొనుక్కు దుస్తులు రంగు మారిపోయాయంటే ఇబ్బంది పడతారు. రంగు పోతుందంటే అస్సలు ఆ డ్రస్, చీర కొనేందుకు ముందే ఆలోచిస్తాం. వాషింగ్ మిషన్ లో వేసేప్పుడు ఉతికే సామర్థ్యానికంటే కూడా ఎక్కువ దుస్తులు వేసి ఉతికేస్తూ ఉంటాం కానీ ఇది కూడా రంగుపోయేలా చేస్తుంది. కాబట్టి తగ్గించి వేయాలి. ఇంతా జగ్రత్త తీసుకున్నా కూడా దుస్తులు రంగుమారిపోతే చాలా కష్టంగా ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే.. కొన్ని ట్రిక్స్ పాటించి ఈజీగా కలర్ సెట్ చేయచ్చు. ఎలా అంటే..
ఉప్పు..
దుస్తులు రంగు పోకూడదంటే… ముందుగా వాటిని ఉప్పు కలిపిన నీటిలో కాసేపు ఉంచి ఆ తరువాత ఉతకాలి. ఉప్పు లోని క్లోరైడ్ దుస్తుల నుంచి రంగు వదలకుండా చేస్తుంది.
రెండు గంటలు..
ఈ ట్రిక్ కొన్ని రంగుల ఫాబ్రిక్ రంగులకు అనుకూలంగా ఉంటుంది. అయితే.. కొన్ని దుస్తులు అయితే.. ఇలా చేసిన తర్వాత కూడా రంగు పోతున్నట్లుగా అనిపిస్తాయి కానీ, ఒక్కసారే పోతుంది. తర్వాతి నుంచి మళ్లీ రంగుపోదు.
వెనిగర్
మామూలుగా దుస్తులు రంగు మారకుండా, ఏదైనా ఒలికిన మరకల్ని, మురికి వాసనలను పోగొడుతుంది. దీనినితో పాటు వెనిగర్ దుస్తుల రంగు పోకూడదనుకుంటే వెనిగర్ నీళ్లలో నానబెట్టాలి. వాటిని కనీసం అరగంట సేపు ఉంచి, ఆరబెట్టండి. రంగు పోకూడదంటే మాత్రం దుస్తులు వెలిసిపోకుండా నీడలో ఆరబెట్టాలి.
వంటసోడా..
ఇది రంగును పోకుండా కాపాడటమే కాదు, దుర్వాసన లేకుండానూ చేస్తుంది.
ఇవి కూడా చదంవండి:
వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!
పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!
కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!
ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..
ఫాబ్రిక్ డై
కొన్నిసార్లు దుస్తుల రంగు ఉతుకుతున్న కొద్దీ బయటకు వస్తుంది. దీని వల్ల దుస్తులు పూర్తిగా పాడైపోయి, మళ్లీ వేసుకోబుద్ది కాదు. బట్టలు ఉతికేటప్పుడు ఫాబ్రిక్ డైని ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి: గోరు వెచ్చని నీరు, నిమ్మరసం కలిపి తీసుకుంటే.. ఎన్ని బెనిఫిట్సో తెలుసా..!
విడివిడిగా ఉతకాలి..
ముదురు, లేత రంగుల దుస్తులను కలిపి కాకుండా… వేటికవే వేరుచేసి ఉతికినా ఏ సమస్యా ఉండదు.
లాండ్రీ డిటర్జెంట్..
బట్టలు ఉతకడానికి ఎప్పుడూ చల్లని నీటిని వాడాలి. వేసవిలో కాటన్ చీరలు లేదా కాటన్ బెడ్ షీట్లను ఉపయోగిస్తే, వాటిని నీడన ఆరనివ్వాలి. అలాగే సబ్బు, సర్ఫ్ పూర్తిగా పోయే వరకూ ఉతకాలి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 01 , 2024 | 02:00 PM