ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhujodi : భలే భుజోడి

ABN, Publish Date - Aug 14 , 2024 | 04:42 AM

హూందాగా, సంప్రదాయంగా కనిపించే చీరల్లో ‘భుజోడి’ హ్యాండ్‌లూమ్‌ శారీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బెంగాలీ కాటన్‌ చీరలను మరిపించే భుజోడి చీరలు మృదువుగా, సౌకర్యంగా హాయిగొలిపే లేత రంగుల్లో తయారవుతూ ఉంటాయి. అన్ని కాలాలకూ తగిన భుజోడి చీరల గురించి తెలుసుకుందామా!

హూందాగా, సంప్రదాయంగా కనిపించే చీరల్లో ‘భుజోడి’ హ్యాండ్‌లూమ్‌ శారీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బెంగాలీ కాటన్‌ చీరలను మరిపించే భుజోడి చీరలు మృదువుగా, సౌకర్యంగా హాయిగొలిపే లేత రంగుల్లో తయారవుతూ ఉంటాయి. అన్ని కాలాలకూ తగిన భుజోడి చీరల గురించి తెలుసుకుందామా!

నాణ్యమైన నూలుతో...

గుజరాత్‌, కచ్‌ ప్రాంతంలోని భుజోడి గ్రామంలో సంప్రదాయ భుజోడి హ్యాండ్‌లూమ్‌ చీరల మూలాలున్నాయి. అత్యంత నాణ్యమైన నూలుతో కూడిన క్లిష్టమైన డిజైన్ల వల్ల భుజోడి చీరలు మహిళలతో పాటు ఫ్యాషన్‌ డిజైనర్లను సైతం ఆకట్టుకుంటున్నాయి. గుజరాత్‌లోని భుజ్‌ నగరానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న భుజోడి గ్రామంలోని కళాకారుల మగ్గాలు వడికే ప్రతి చీరలో, శాలువాలో, ఘాగ్రాలో, దుప్పట్లలో 500 ఏళ్ల నాటి చరిత్ర ప్రతిఫలిస్తూ ఉంటుంది.

వేర్వేరు సందర్భాల్లో....

ఆఫీస్‌ వేర్‌గా భుజోడి చీరలను నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు. రోజంతా చీరకట్టులో గడపడం అసౌకర్యంగా భావించే మహిళలు సైతం ఈ చీరలను నిస్సంకోచంగా ఎంచుకోవచ్చు. తేలికగా, మెత్తగా ఉంటాయి కాబట్టి రోజంతా చీరకట్టులో ఉన్నా చికాకు అనిపించదు. కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే, ఆకర్షణీయమైన మోటిఫ్స్‌, డిజైన్లను కలిగి ఉండే చీరలను ఎంచుకుంటే సరిపోతుంది. ఈవినింగ్‌ వేర్‌గా కూడా ఈ చీరలు బాగుంటాయి. క్లాసీ లుక్‌ కోసం కలంకారీ పనితనమున్న స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ఎంచుకోవాలి.

అన్ని కాలాలకూ తగ్గట్టుగా

కాటన్‌ చీరలు అనగానే వాటి మెయింటేనెన్స్‌ కష్టమని అనుకుంటాం. కానీ భుజోడి చీరలు అందుకు పూర్తి భిన్నం. బెంగాలీ కాటన్‌ చీరల్లా వీటికి గంజితో పని ఉండదు. మెత్తగా, ఒంటికి హత్తుకుని హాయిగొలుపుతాయి. పైగా వేసవిలో చల్లదనాన్నీ, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందిస్తాయి. కాబట్టి అన్ని కాలాలకూ అనువైన భుజోడి చీరలను మరో ఆలోచన లేకుండా కొనుగోలు చేయొచ్చు. ఈ చీరల తయారీలో సహజసిద్ధ రంగులను ఉపయోగిస్తారు కాబట్టి వెలిసిపోతాయనే భయం కూడా ఉండదు. కలంకారీ బ్లౌజ్‌, మెటల్‌ జ్యువెలరీలతో మ్యాచ్‌ చేస్తే, భుజోడి చీరల్లో స్టైలిష్‌గా కనిపిస్తాం. ప్రత్యేకమైన లుక్‌ కోసం జామెట్రిక్‌ మోటిఫ్స్‌ డిజైన్‌ చీరలను ఎంచుకోవాలి.

Updated Date - Aug 14 , 2024 | 04:42 AM

Advertising
Advertising
<