ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diwali: అమెరికాలోని నెబ్రాస్కా గవర్నర్ నివాసంలో దీపావళి సంబరాలు

ABN, Publish Date - Nov 01 , 2024 | 02:42 PM

అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్ర గవర్నర్ నివాస ప్రాంగణంలో దీపావళి వేడుకలు జరిగాయి. దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. ప్రదర్శనలో ఉన్న వివిధ కళాఖండాల చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై ఆలోచనలను పంచుకున్నారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన వారికి గవర్నర్ నివాసంలో వారసత్వానికి ఒక సంగ్రహావలోకనం అందించారు.

Nebraska

అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్ర గవర్నర్ (Jim Pillen & Suzanne Pillen) నివాస ప్రాంగణంలో దీపావళి వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు నెబ్రాస్కా రాష్ట్ర భారతీయ ప్రముఖులు డాక్టర్ ఫణి తేజ్ ఆదిదం, సుందర్ చొక్కర (నెబ్రాస్కా హిందూ దేవాలయం అధ్యక్షుడు), కొల్లి ప్రసాద్, నవీన్ కంటెం, మల్లికా మద్దూరి జయంతి, దిలీప్ దోనేపూడి, తాతారావు కోసూరి, రాజా కోమటిరెడ్డి, అరుణ్ పాండిచ్చేరి, వందనా సింగ్, ముకుంద్ క్యామ్టీ, సుధా శివమణి, ప్రశాంత్ పనిక్కస్సేరిల్, కీర్తి రంజిత్, తపన్ దాస్, శైలేష్ ఖోస్, ఇషాని అడిదమ్, శరత్ చంద్ర దొంతరెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ నాయకులు తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా విభిన్న ప్రాంతీయ, భాషా సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు.

దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. ప్రదర్శనలో ఉన్న వివిధ కళాఖండాల చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై ఆలోచనలను పంచుకున్నారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన వారికి గవర్నర్ నివాసంలో వారసత్వానికి ఒక సంగ్రహావలోకనం అందించారు.


బేస్‌మెంట్ హాల్‌లో ప్రథమ మహిళతో కలిసి దీపావళి వేడుకలను గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. వారందరూ కలసి దీపం వెలిగించి ఉత్సవాలకు నాంది పలికారు. ఆ తర్వాత డాక్టర్ ఫణి తేజ్ ఆదిదమ్ హిందూ ప్రార్థనకు నాయకత్వం వహించి, దాని ప్రాముఖ్యతను వివరించారు. ఈ ప్రార్థనను గవర్నర్ హృదయపూర్వక ప్రశంసలతో స్వీకరించారు.

యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా ఒమాహా విద్యార్థి నాయకురాలు ఇషాని అడిడమ్, సంఘం తరపున దీపావళి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగించారు. మల్లికా మద్దూరి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి పండుగను పురస్కరించుకుని గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

గవర్నర్ మాట్లాడుతూ అమెరికన్, హిందూ సంప్రదాయాలలో వైవిధ్యం, విలువలను తెలియజేస్తూ మాట్లాడారు. గవర్నర్ మాన్షన్‌లో ప్రతిభావంతులైన చెఫ్‌లు తయారు చేసిన రుచికరమైన దీపావళి విందు, అనంతరం ఫోటో సెషన్‌తో ఈ వేడుక ముగిసింది. గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తి చేసి బయలుదేరగా.. రాష్ట్ర ప్రథమ మహిళ సంఘంతో కలిసి దీపావళి విందు చేశారు. అనంతరం హాజరైన వారికి వ్యక్తిగతంగా వీడ్కోలు పలికారు.

Updated Date - Nov 01 , 2024 | 02:42 PM