NRI News: నెబ్రాస్కాలో అధికారికంగా దీపావళి వేడుకలు
ABN, Publish Date - Aug 20 , 2024 | 09:24 AM
భారతీయ విశిష్ట పర్వదినం దీపావళి పండుగను అధికారికంగా గుర్తించినట్టు అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్ర గవర్నర్ జిమ్ పిల్లెన్ కార్యాలయం ప్రకటించింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి వారంగా గుర్తిస్తున్నట్లు తెలిపింది.
నెబ్రాస్కా: భారతీయ విశిష్ట పర్వదినం దీపావళి పండుగను అధికారికంగా గుర్తించినట్టు అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్ర గవర్నర్ జిమ్ పిల్లెన్ కార్యాలయం ప్రకటించింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి వారంగా గుర్తిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు అక్టోబర్ నెలను నెబ్రాస్కా రాష్ట్రంలో హిందూ వారసత్వ మాసంగా కూడా గుర్తిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు.
తరతరాలుగా వస్తున్న హిందూ సాంస్కృతిక వారసత్వం, సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు దీపావళి వేడుకలను ఉల్లాసంగా జరుపుకోవడం కోసం అమెరికాలోని భారతీయ హిందూ సంఘం చేసిన కృషి ఫలితంగా ఈ ప్రకటన వచ్చింది. దీంతో నెబ్రాస్కా రాష్ట్రంలోని హిందూ సోదరులు అందరూ దీపావళి వేడుకలను, హిందూ వారసత్వ నెల ఉత్సవాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు కమ్యూనిటీతో ఘనంగా జరుపుకోవాలని హిందూ నాయకులు కోరారు.
నెబ్రాస్కా స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ లింకన్‌లో వార్నర్ లెజిస్లేటివ్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో భారతీయ సంస్కృతి, దీపావళి పండుగ ప్రాముఖ్యతపై డాక్టర్ ఫణి తేజ్ ఆదిదం మాట్లాడారు. హిందువుల తరపున రాష్ట్ర గవర్నర్ జిమ్ పిల్లెన్కు హృదయ పూర్వక ధన్యవాదములను తెలిపారు. ఈ పండుగకు అధిరికారికంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావటానికి మల్లికా జయంతి, కొల్లి ప్రసాద్, నవీన్ కంటెం, డాక్టర్ ఫణి తేజ్ ఆదిదం, వెంకట్ జయంతి, రాజా కోమటిరెడ్డి, టాటారావు కోసూరి, అనిల్ పోతినేని, తపన్ దాస్, శైలేందర్, అరుణ్ కుమార్ పాండిచ్చేరి, దేవిక పాండిచ్చేరి, మాధవి, పీయూష్ శ్రీవాస్తవ్, ప్రవీణ్ గుమ్మడవల్లి, శ్రీపత్ కాంబ్లే, రామకృష్ణ కిలారు తదితరులు విశేషంగా కృషి చేశారు. అధికారికంగా గుర్తింపు దక్కడంతో కమ్యూనిటీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
Updated Date - Aug 20 , 2024 | 09:25 AM