ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: కన్నబిడ్డల పుట్టిన తేదీలున్న 2 లాటరీ టిక్కెట్లను ఎంచుకున్నాడు.. చివరకు ఎంత గెలిచాడో తెలిస్తే..

ABN, First Publish Date - 2024-02-10T21:27:03+05:30

తల్లిదండ్రులకు బిడ్డలే సర్వస్వం. వారే తమ కంటివెలుగు..అదృష్టం. బిడ్డల పుట్టిన తేదీకి మించిన లక్కీ నెంబర్ తల్లిదండ్రులకు ఉండడేమో. ఓ ఎన్నారై జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది.

ఎన్నారై డెస్క్: తల్లిదండ్రులకు బిడ్డలే సర్వస్వం. వారే తమ కంటివెలుగు..అదృష్టం. బిడ్డల పుట్టిన తేదీకి మించిన లక్కీ నెంబర్ తల్లిదండ్రులకు ఉండడేమో. ఓ ఎన్నారై జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. తన బిడ్డల పుట్టిన తేదీల ఆధారంగా లాటరీ టిక్కెట్‌ను ఎంచుకున్న అతడికి రాత్రికి రాత్రి అదృష్టం వరించింది. తను గెలుచుకున్న సొమ్ము మొత్తం చూసి అతడి సంబరానికి అంతేలేకుండా పోయింది (Indian Man Wins 33 Crore Jackpot Using Children's Birth Dates On Winning Ticket).

కేరళకు (kerala) చెందిన రాజీవ్ అరిక్కట్ కొన్నేళుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. అల్ అయిన్‌లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. స్థానిక ఆర్కిటెక్చర్ సంస్థలో పనిచేస్తున్నాడు. గతమూడేళ్లుగా ఆయన బిగ్ టిక్కెట్ అబుదాబి వీక్లీ డ్రా (Big ticket abudhabi weekly draw) లాటరీలో పాల్గొంటున్నారు. ఇటీవలే ఆయనకు లాటరీ కొద్దిలో మిస్సైంది. ఆ తరువాత కన్నబిడ్డల పుట్టిన తేదీలున్న లాటరీ టిక్కెట్ కొనడంతో దశ తిరిగింది.


‘‘నేను లాటరీ గెలుచుకోవడం ఇదే తొలిసారి. నా పిల్లల్లో ఒకరు 7వ తేదీన, మరొకరు 13వ తేదీన పుట్టారు. దీంతో, ఆ సంఖ్యలపై లాటరీ టిక్కెటు కొనాలని నేను, మా ఆవిడ నిర్ణయించుకున్నాం.అయితే, బిగ్ టిక్కెట్ డ్రా వాళ్లు నాకో ఆఫర్ ఇచ్చారు. రెండు టిక్కెట్లు కొన్నందుకు మరో నాలుగు టిక్కెట్లు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. గెలుస్తానని ఎందుకో అనిపించింది కానీ లాటరీ మొత్తం తెలుసుకున్నాక నాకు నోటమాటరాలేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

ఆయనకు కాంప్లిమెంటరీగా ఇచ్చిన టిక్కెట్లలో ఒకదానికి ఏకంగా రూ.33 కోట్ల లాటరీ తగిలింది. దీంతో, రాజీవ్ నోరెళ్లబెట్టారు. ‘‘లాటరీలో ఫస్ట్ ప్రైజ్ వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితమే మారిపోయింది’’ అని చెప్పారు.

మరో గొప్ప విషయం ఏంటంటే, లాటరీ మొత్తాన్ని రాజీవ్ తన బృందంలోని మరో 19 మందితో కలిసి పంచుకునేందుకు నిర్ణయించారు. దీంతో, వారందరిలోనే హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2024-02-10T21:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising