AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన
ABN, Publish Date - Jul 24 , 2024 | 05:12 PM
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. భారీ వర్షాలతో నష్ట పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆ క్రమంలో బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలంటూ.. నడుంలోతు నీళ్లలోకి దిగి తన వినూత్నం నిరసనను తెలిపారు.
Updated Date - Jul 26 , 2024 | 11:12 AM