ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Brahmotsavam: అంగరంగా వైభవంగా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు

ABN, Publish Date - Oct 05 , 2024 | 08:46 AM

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ కార్య నిర్వహణాధికారి శ్యామల రావు అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ధ్వజ స్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని అందజేశారు.

1/7

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలకు సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు

2/7

సీఎం చంద్రబాబుకు వరిపట్టం చుడుతున్న వేద బ్రాహ్మణులు

3/7

తిరుమలలో ధ్వజస్తంభం వద్ద పూజలు చేస్తున్న చంద్రబాబు

4/7

తిరుమలలో వరిపట్టం చుట్టుకుని పట్టువస్త్రాలు తీసుకుని ఆలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు

5/7

తిరుమలలో శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని సీఎం చంద్రబాబుకు అందజేస్తున్న టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, తదితరులు

6/7

శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద చంద్రబాబుతో ఫొటోలు దిగుతున్న టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, తదితరులు

7/7

పద్మావతి అతిథిగృహం వద్ద సీఎం చంద్రబాబుకి స్వాగతం పలుకుతున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అధికారులు

Updated Date - Oct 05 , 2024 | 09:12 AM