ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తికి అరుదైన రికార్డు

ABN, Publish Date - Nov 17 , 2024 | 10:44 AM

త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌కు అరుదైన రికార్డు దక్కింది.. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ రికార్డ్‌ సృష్టించారు..

1/5

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు.. జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌కు యూకే వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు దక్కింది.. 2017 నుంచి ఇప్పటివరకు 92వేల కేసులు పరిష్కరించారు జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందినవారు.

2/5

ఈ సందర్భంగా తన బెంచ్‌లో పెండింగ్ కేసులు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ తెలిపారు.

3/5

జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ 2017లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2021 అక్టోబర్ 28న జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ త్రిపుర హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.

4/5

నవంబర్ 11, 2022 నుంచి ఏప్రిల్ 16, 2023 వరకు త్రిపుర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో 40 పెండింగ్ కేసులను పరిష్కరించగా.. త్రిపుర హైకోర్టులో 60 శాతం కేసుల్లో తీర్పు వెల్లడించారు.

5/5

జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ అత్యధిక కేసులను పరిష్కరించడంపై ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదగాలని కోరుకున్నారు. యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 10:45 AM