Revanth Reddy:రాజన్న సన్నిధిలో రేవంత్
ABN , Publish Date - Nov 21 , 2024 | 08:24 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఉదయం 10.57 గంటలకు రాజన్న ఆలయ గుడిచెరువు వద్ద హెలికాప్టర్ దిగిన ముఖ్యమంత్రి.. నేరుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఫూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానం ఆవరణలో ధర్మగుండం వద్ద రూ.76 కోట్లతో చేపట్టే ఆలయాభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద కోడెను కట్టి సీఎం రేవంత్‌రెడ్డి మొక్కు చెల్లించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఉదయం 10.57 గంటలకు రాజన్న ఆలయ గుడిచెరువు వద్ద హెలికాప్టర్ దిగిన ముఖ్యమంత్రి.. నేరుగా ఆలయానికి చేరుకున్నారు.
ఆలయ అర్చకులు ఆయనకు ఫూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానం ఆవరణలో ధర్మగుండం వద్ద రూ.76 కోట్లతో చేపట్టే ఆలయాభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
అనంతరం దేవాలయ అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద కోడెను కట్టి సీఎం రేవంత్‌రెడ్డి మొక్కు చెల్లించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రచార సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాజన్నను దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధి కోసం రూ.127.65 కోట్లు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసింది.
సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడలో స్వామివారిని దర్శించుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తూ రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా.. అది ఆచరణకు నోచుకోలేదు.
బీఆర్‌ఎస్ సర్కారు హామీలు కాగితాల మీద డిజైన్లుగానే మిగిలిపోయాయి.
ముఖ్యమంత్రి వేములవాడ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 1,100 మంది పోలీసులు పటిష్ట బందోబస్తులో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోపర్యటించారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనతంరం పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు.
చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కాగా రాజన్న ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 127 కోట్లు మంజూరు చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. ఇందుకోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తుతో పాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని, బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.
సీఎం పర్యటన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల మళ్లింపు చేపట్టారు. పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్‌లతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ముఖ్యమంత్రి ఉదయం హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి వేములవాడకు చేరుకోని ముందుగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఇప్పటికే మంజూరైన రూ 127.65 కోట్లకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేశారు.
. రూ. 50 కోట్లతో యారన్ డిపోను ప్రారంభించారు. దీంతో పాటు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. 17 గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున రూ. 85 లక్షల ప్రొసీడింగ్‌లను అందజేశారు.
రద్దీకి అనుగుణంగా ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడం, భక్తులకు సరిపడా మౌలిక వసతులు లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని, కానీ.. ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు.
రూ. 235 కోట్లతో మిడ్ మానేరు నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు రూ. 166 కోట్లతో చేపట్టే మెడికల్ కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణాలకు, రూ. 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం పనులు, రూ. 52 కోట్లతో కోనరావుపేట మండలంలో చేపట్టే హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ ప్రాంతం నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లేవారి కోసం గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేశామని, ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తున్నామని తెలిపారు.
631 శివశక్తి మహిళ సంఘాలకు రూ 102 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. దేవస్థానం గుడిచెరువు మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రి వేములవాడ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 1,100 మంది పోలీసులు పటిష్ట బందోబస్తులో పాల్గొన్నారు. బందోబస్తుకు సంబంధించి సెక్టార్‌లుగా విభజించి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులను బాధ్యులుగా నియమించారు.
బందోబస్తులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఏడు చోట్ల పోలీసులు ఏర్పాట్లు చేశారు.
పరిశ్రమలు స్థాపించాలంటే, అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందేనని, ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే భూములు కోల్పోయిన వారి బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్నారు. భూములు కోల్పోయే వారికి భూమి రేటును మూడు రెట్లు పెంచి పరిహారంగా ఇవ్వాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని, రైజింగ్ తెలంగాణగా నిలుపుతామని ప్రకటించారు. ఈ దేశానికి దశ దిశను నేర్పిన పీవీ నర్సింహారావు, చొక్కారావు, ఎంఎస్‌ఆర్‌ను అందించిన గడ్డ కరీంనగర్ అని రేవంత్ కొడియాడారు.
పెప్పర్ స్ర్పేలకు భయపడకుండా తెలంగాణ నాడు ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. పొన్నంను ఎంపీని చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారన్నారు. కానీ, బండి సంజయ్‌ను రెండుసార్లు గెలిపిస్తే ఆయన చేసిందేమి లేదని, మంత్రి మాత్రం అయ్యారని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ చేయలేని పనులన్నింటినీ చేస్తున్నామని రేవంత్ చెప్పారు. కేసీఆర్ ఫామ్‌హౌ్‌సలో పడుకుంటే.. కొడుకు, అల్లుడు తమ కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు.
25 రోజుల్లో 23 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఇందుకు ఒక పెద్దమనిషిగా తమను అభినందించాల్సింది పోయి.. చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘ఈ పదేళ్లలో నువ్వేమి చేశావో ఒక రోజంతా చర్చ చేద్దాం.. లెక్కలేందో తేలుద్దాం.. అసెంబ్లీకి రా సామీ. నువ్వు దిగిపో.. దిగిపో అని నీ కొడుకు, అల్లుడు అంటున్నారు. మీ నొప్పికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మందు పెట్టేందుకు మావాళ్లు సిద్ధంగా ఉన్నారు’’ అని రేవంత్ అన్నారు.
తాము వచ్చాక 50 వేల ఉద్యోగాలు కల్పించామని, వాళ్లందరినీఎల్‌బీ స్టేడియంకు పిలిపిస్తానని, వచ్చి లెక్కపెట్టుకోవాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. ఒక్క తల తగ్గినా తాను క్షమాపణ చెబుతానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీళ్లు రాకున్నా.. రైతులు ఈ సీజన్‌లో 66 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసి 1.53 కోట్ల టన్నుల దిగుబడులు సాధించారని తెలిపారు.
Updated Date - Nov 22 , 2024 | 02:42 PM