RBI quiz: కాలేజీ స్టుడెంట్స్‌కు సువర్ణావకాశం.. రూ. 10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్
ABN , Publish Date - Nov 19 , 2024 | 06:59 AM
డిగ్రీ విద్యార్థులకు రిజర్వ్‌బ్యాంక్ (Reserve Bank of India) ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తుంది. ఆర్‌బీఐ స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా క్విజ్ పోటీలు జరుగుతున్నాయి. ఇందుకోసం సంబంధిత ఆర్‌బీఐ వైబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
క్విజ్ పోటీల్లో పాల్గొనే వారు బృందంగా ఏర్పడి నమోదు కావచ్చు. బృందంలో కనీసం ఇద్దరు విద్యార్థులు ఉండాలి.
2024 సెప్టెంబరు 1వ తేదీ నాటికి 25 ఏళ్లలోపు వయసు ఉండి ఏదైనా కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు.
పోటీలు స్టేట్‌రౌండ్, జోనల్ స్థాయి, జాతీయ స్థాయిలో మూడు స్థాయిల్లో జరుగుతాయి. ఈ అవకాశాన్ని డిగ్రీ చదివే విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.
ఈ క్విజ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల విద్యార్థులు రూ.10 లక్షలు గెలుచుకునే సువర్ణావకాశాన్ని ఆర్‌బీఐ కల్పించింది.
విద్యార్థుల్లో రిజర్వు బ్యాంకు ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహనతోపాటు డిజిటల్ లావాదేవీలు, సురక్షిత బాధ్యతాయుత వినియోగం తదితరాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ పోటీలను నిర్వహిస్తోంది.
మొత్తం నాలుగు దశల్లో క్విజ్ పోటీలు జరుగుతాయి. తొలుత జిల్లా స్థాయి, ఆన్‌లైన్ దశ ప్రారంభమై రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు.
Updated Date - Nov 19 , 2024 | 06:59 AM