TechnoZion-2024: నిట్ క్యాంపస్‌లో ఘనంగా టెక్నోజియాన్ వేడుకలు
ABN , Publish Date - Nov 12 , 2024 | 09:22 AM
వరంగల్ నిట్ క్యాంపస్‌లో టెక్నోజియాన్ వేడుకలు ఘనంగా జగిగాయి. మూడురోజులపాటు జాతీయ సాంకేతిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు దేశంలోని పలు ఇన్‌స్టిట్యూట్స్ నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులు నిట్‌కు చేరుకున్నారు. వేడుకల్లో ఆరు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. చివరి రోజు ఎస్కేప్ రూం, ఆస్ట్రో వరల్డ్, క్యాంపస్ ఇన్నోవేటిస్ ఈవెంట్లు నిర్వహించారు.
రెండేళ్లు కరోనాతో ఆగిపోయిన టెక్నోజియాన్ సంబరం ఈ ఏడాది మళ్లీ ప్రారంభమైంది. ఈ సారి ‘ఇగ్నోసి - ది క్వెస్ట్‌ఫర్ విస్‌డమ్’ (జ్ఞానం కోసం తపన) అనే థీమ్‌తో వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా సుమారు ఆరువేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు సంబంధించి వస్తున్న మార్పులను తెలుసుకోవడం, చర్చలు చేయడంతో పాటు ప్రదర్శనల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. సాంకేతిక సృజన వేడుకలే కాకుండా, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా టెక్నోజియాన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
స్పాట్‌లైట్స్, స్టాండప్ కామెడీ, ప్రోషో, పిట్‌స్టాప్, జహాజ్, హార్డ్‌వేర్, గెస్ట్ లెక్చర్, కల్చరల్ ఈవెంట్స్, వివిధ ఆవిష్కరణలతో మూడు రోజులపాటు క్యాంప్‌సలో విద్యార్థులు సందడి చేశారు. వివిధ ఈవెంట్స్‌కు క్యాష్‌ప్రైజ్‌లు, సర్టిఫికెట్స్ ఇవ్వనున్నారు. మొత్తంగా 60 ఈవెంట్లు నిర్వహించారు.
వివిధ ఈవెంట్స్‌కు క్యాష్‌ప్రైజ్‌లు, సర్టిఫికెట్స్ ఇవ్వనున్నారు. మొత్తంగా 60 ఈవెంట్లు నిర్వహించారు. ప్రథమ బహుమతిగా రూ.20 లక్షల నగదు అందించారు. అందుకు స్టూడెంట్స్ కో-ఆర్డినేటర్‌లు అన్ని ఏర్పాట్లు చేశారు.
స్పాట్‌లైట్స్, స్టాండప్ కామెడీ, ప్రోషో, పిట్‌స్టాప్, జహాజ్, హార్డ్‌వేర్, గెస్ట్ లెక్చర్, కల్చరల్ ఈవెంట్స్, వివిధ ఆవిష్కరణలతో మూడు రోజులపాటు క్యాంప్‌సలో విద్యార్థులు సందడి చేశారు. వివిధ ఈవెంట్స్‌కు క్యాష్‌ప్రైజ్‌లు, సర్టిఫికెట్స్ ఇవ్వనున్నారు. మొత్తంగా 60 ఈవెంట్లు నిర్వహించారు.
టెక్నోజియాన్‌కు దేశం నలుమూలల నుంచి 6వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. గతంలో కంటే ఈసారి రెండు వేల మంది విద్యార్థులు అధికంగా హాజరైనట్లు నిట్ వర్గాలు తెలిపాయి.
Updated Date - Nov 12 , 2024 | 10:45 AM