ఈ ఆహారాలు తినండి.. ఎన్నేళ్లు అయినా జుట్టు నెరవదు..!
ABN , Publish Date - Aug 21 , 2024 | 03:34 PM
మనిషి వయసును అంచనా వేయడానికి రూపాన్ని కొలమానంగా తీసుకుంటారు. చర్మం ముడతలు పడటం, జుట్టు నెరిసిపోవడం ఈ కోవకు చెందినవే.. కానీ ఈ మధ్యకాలంలో పెద్ద చిన్న వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం చూస్తున్నాం. దీన్నే అకాలంగా జుట్టు నెరవడం అంటారు. అకాలంగా నెరిసే జుట్టును ఈ కింది ఆహారాలు తీసుకోవడం ద్వారా నల్లగా మార్చుకోవచ్చు.
అకాలంగా నెరిసే జుట్టును ఈ కింది ఆహారాలు తీసుకోవడం ద్వారా నల్లగా మార్చుకోవచ్చు.
పాలకూర..
జుట్టు అకాలంగా నెరవడం ప్రారంభించినట్టు అయితే ఆహారంలో పాలకూర తీసుకోవడం బాగా సహాయపడుతుంది. పాలకూర, తోటకూర, మునగకూర వంటివి జుట్టు నెరిసిపోవడాన్ని తగ్గిస్తాయి. తిరిగి జుట్టు నల్లగా మారేందుకు సహాయపడతాయి.
బెర్రీలు..
బెర్రీ జాతికి చెందిన పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు లోపలి నుండి ముదురు రంగును అందించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్లు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, బ్లూబెర్రీలు వంటివి తినాలి.
తృణధాన్యాలు..
తృణధాన్యాలు ఆహారంలో చేర్చుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. బ్రౌన్ రైస్, క్వినోవా మొదలైనవాటిలో జింక్, విటమిన్-బి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును నల్లబరుస్తాయి.
డ్రై నట్స్..
బాదం, వాల్నట్స్, చియా గింజలలో బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టు తొందరగా నెరసిపోయే స్వభావంను దూరం చేస్తుంది.
ఉసిరి..
ఉసిరికాయను లేదా ఉసిరి జ్యూస్ లేదా ఉసిరి పొడిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు నల్లగా మారుతుంది. ఉసిరి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనికారణంగా జుట్టు నల్లగా మారుతుంది.
కరివేపాకు..
కరివేపాకు జుట్టు సంరక్షణలో మెరుగ్గా పనిచేస్తుంది. కరివేపాకును ఆహారంలో బాగా తీసుకోవడం, కరివేపాకు పొడి తీసుకోవడం, రోజూ ఒక రెమ్మ కరివేపాకులు పచ్చిగా నమిలి తింటూంటే జుట్టు నల్లగా మారుతుంది.
Updated Date - Aug 21 , 2024 | 03:34 PM