ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్పాట్ జాగింగ్ ఇంత పవరా? రోజూ 10నిమిషాలు చేస్తే ఏం జరుగుతుందంటే..!

ABN, Publish Date - Aug 02 , 2024 | 02:21 PM

జాగింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. రన్నింగ్, వాకింగ్ కాకుండా జాగింగ్ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. జాగింగ్ కూడా రన్నింగ్, వాకింగ్ లాగే సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. అయితే కేవలం నిలబడిన చోటే చేసేది స్పాట్ జాగింగ్. ఇది ఏరోబిక్ వ్యాయామంలో బాగం. సాధారణంగా వార్మప్ లో భాగంగా దీన్ని చేస్తుంటారు. కానీ రోజూ 10నిమిషాలు స్పాట్ జాగింగ్ చేసేవారికి బోలెడు లాభాలు ఉంటాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.

1/6

గుండె ఆరోగ్యం.. రోజూ 10 నిమిషాలు స్పాట్ జాగింగ్ చేస్తే హృదయ స్పందన రేటు పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది.

2/6

ఎనర్జీ, స్టామినా.. రెగ్యులర్ గా స్పాట్ జాగింగ్ చేస్తుంటే స్టామినా పెరుగుతుంది. ఇది శరీరం ఆక్సిజన్ ను సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది.

3/6

బరువు.. శరీరంలో కేలరీలు బర్న్ చేయడానికి స్పాట్ జాగింగ్ భలేగా సహాయపడుతుంది. వేగంగా స్పాట్ జాగింగ్ చేయడం వల్ల కేవలం 10 నిమిషాల్లోనే 100కేలరీలు బర్న్ అవుతాయి. ఇది వేగంగా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

4/6

మానసిక ఆరోగ్యం.. స్పాట్ జాగింగ్ మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఎండార్పిన్లను విడుదల చేస్తుంది. ఎండార్ఫిన్లు సహజమైన మూడ్ లిఫ్టర్లు. వీటి వల్ల ఆందోళన, నిరాశ తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది.

5/6

కండరాలు.. స్పాట్ జాగింగ్ చేస్తే శరీర కండరాలు బలపడతాయి. కండరాల పనితీరు మెరుగవుతుంది. ముఖ్యంగా తొడలు, కాళ్ల కండరాలు టోన్ అవుతాయి.

6/6

సౌకర్యం.. స్పాట్ జాగింగ్ వాకింగ్, రన్నింగ్ కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి అదనపు ఖర్చు కానీ, జిమ్, ఔట్ డోర్ ప్రదేశం కానీ అవసరం లేదు. కేవలం నిలబడుకోవడానికి, చేతులు చాపినంత మేర ఖాళీ ప్రదేశం ఉంటే సరిపోతుంది. కేవలం 10 నిమిషాలు చేసినా ఫలితాలు మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నవారైనా దీన్ని చేయవచ్చు.

Updated Date - Aug 02 , 2024 | 02:25 PM

Advertising
Advertising