ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ABN Big Debate: షర్మిలకి నేను అండగా ఉంటా.. ఇక జగన్ పని అయిపోయింది

ABN, Publish Date - Jan 06 , 2024 | 05:25 PM

ABN Big Debate With CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. పైగా పోటా పోటీగా తెలుగు ప్రముఖ చానెల్స్, దినపత్రికలు ఇంటర్వ్యూల కోసం పోటీ పడినప్పటికీ.. ఎన్నికల ముందు ‘బిగ్ డిబేట్‌’లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు..


09:45 PM : ఇటీవల UPSC చైర్మన్‌కు కలిశాం: సీఎం రేవంత్‌రెడ్డి

  • TSPSCని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నాం..

  • TSPSC అధికారులు చేసిన రాజీనామాలు గవర్నర్‌ ఆమోదించాలి..

  • గవర్నర్‌ ఆమోదించాక కొత్త కమిటీని నియమిస్తాం..

  • చైర్మన్‌ లేకుండా ఏ పరీక్ష నిర్వహించలేం.. ఫలితాలు ప్రకటించలేం..

  • ఈ ప్రక్రియను వేగవంతంగా చేయాలని చూస్తున్నాం..

  • భర్తీలు వేగంగా చేపట్టాలని మా ప్రభుత్వం చూస్తుంది..

  • యుద్ధప్రాతిపదికన నియామకాలపైన దృష్టి పెట్టాం..

  • ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 2 లక్షలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి


09:35 PM : ప్రగతిభవన్‌లోని 5 భవనాలను కేటాయింపులు చేశాం: రేవంత్‌రెడ్డి

  • క్యాంప్‌ ఆఫీస్‌ను జ్యోతిబాపూలే స్టడీ సెంటర్‌గా మార్చాం..

  • కేసీఆర్‌ ఉన్న నివాసాన్ని భట్టి విక్రమార్కకు కేటాయించాం..

  • కేటీఆర్‌ ఉన్న నివాసాన్ని సీతక్కకు కేటాయించాం..

  • స్టేట్‌ గెస్ట్‌హౌస్‌గా మరో భవనాన్ని వాడుకుంటున్నాం..

  • మరో భవనాన్ని ప్రజావాణికి ఉపయోగిస్తున్నాం..

  • అధికారం శాశ్వతమైన ఆస్తి అని బావ, బామ్మర్దులు అనుకుంటున్నారు..

  • అందుకే వాళ్లు గగ్గోలు పెట్టడం చూస్తున్నాం..

  • సీనియర్‌ నేత కడియం శ్రీహరి కూడా ఏదోలా మాట్లాడుతున్నారు..

  • వెట్టిచాకిరిని ఇంకా చేయడం బాధ కలిగిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి


09:25 PM : ఆ ప్రాజెక్టులపై విచారణ జరిపిస్తాం: రేవంత్‌రెడ్డి

  • పవర్‌ ప్రాజెక్టులు, మేడిగడ్డపై జ్యుడిషియల్‌ ఎంక్వైరీ వేయిస్తాం: రేవంత్‌రెడ్డి

  • తెలంగాణ సీఎస్‌కు ఈ అంశంపై లేఖ కూడా రాయబోతున్నాం..

  • తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇప్పటివరకు బ్రహ్మపథంగా ఉండేది..

  • అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం..

  • ఇరిగేషన్‌కు సంబంధించి ఇంకా పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది..

  • ప్రజల దగ్గరకు పాలన ఉండాలనే అధికారులను పంపించాం..

  • ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి..

  • ఇక నుంచి కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు ఇవ్వొచ్చు: రేవంత్‌రెడ్డి


లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

09: 15 PM : ముఖ్యమంత్రి పదవి నాకు ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కినట్లే: సీఎం రేవంత్‌రెడ్డి

  • నేను ఏ పనైనా చేయాలా.. వద్దా.. అని 100 సార్లు ఆలోచిస్తా..

  • చేయాలని అనుకుంటే వెంటనే ముందుకు వెళ్లడమే..

  • నేతలను రాత్రికి రాత్రే మార్చలేం: సీఎం రేవంత్‌రెడ్డి..

  • మనం కష్టపడాలి.. కష్టంలో లోపం ఉండకూడదని..

  • నా సతీమణి గీత చెబుతుంది: సీఎం రేవంత్‌రెడ్డి..

  • నా భార్య, బిడ్డ నాకు అన్ని విషయాల్లో సపోర్ట్‌గా ఉంటారు..

  • కుటుంబసభ్యులు నసపెట్టడం లాంటివి ఉండవు..

  • రాజకీయ ప్రస్థానంలో నా సతీమణి నాకు 100శాతం సపోర్ట్‌ ఇస్తుంది..

  • నా సోదరులు కూడా పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు..

  • నా సోదరులు ఏ అధికారులకు ఫోన్లు చేయడం లేదు..

  • అధికారులే కొందరు వెళ్లి కలుస్తున్నారు..

  • మన కదలికలన్నీ గమనిస్తుంటారని..,

  • నా సోదరులకు నేను స్పష్టంగా చెప్పా..

  • నా సోదరులు అన్ని విషయాలు ఆలోచించి నడుచుకుంటున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి


లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

09: 10 PM : చంద్రబాబు ఎవరితోనైనా కలవొచ్చు.. అది వారిష్టం: సీఎం రేవంత్‌రెడ్డి

  • ఏపీ కాంగ్రెస్‌ పార్టీ గురించి మాత్రమే మేం ఆలోచిస్తాం..

  • షర్మిలకి నేను అండగా ఉంటా.. ఇక జగన్ పని అయిపోయింది.

  • ఏపీలో కాంగ్రెస్‌ విస్తరణకు నేను అన్ని రకాలుగా ఉపయోగపడాలి..

  • పార్టీకి, షర్మిలకు ఉపయోగపడుతుంటే అన్ని రకాలుగా..

  • జగన్‌ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూస్తున్నా..

  • రెండు రాష్ట్రాల మధ్య కూర్చుని చర్చించి..

  • పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి..

  • కర్ణాటకతో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి..

  • కలిసి చర్చించుకుంటాం: సీఎం రేవంత్‌రెడ్డి..

  • రాష్ట్రాలుగా విడిపోయాం.. మనుషులుగా కొట్టుకోవాల్సిన అవసరం లేదు..

  • తెలంగాణ ప్రయోజనాల కోసం జగన్‌ను కలుస్తాను..

  • సీఎంగా ఎవరవుతారు.. ఎంతకాలం ఉంటారనేది ఎవరి చేతుల్లో లేదు..

  • అధిష్టానం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది..

  • నేను టీం లీడర్‌గా అందరితో కలిసి వారితో ముందుకెళ్లాలి..

  • అదే బాధ్యతను ప్రస్తుతం నేను నిర్వహిస్తున్నా: సీఎం రేవంత్‌రెడ్డి


లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

09: 05 PM : ఏపీ కాంగ్రెస్‌కు కాబోయే అధ్యక్షురాలు షర్మిలనే : సీఎం రేవంత్‌రెడ్డి

  • ఏపీ పరిణామాలపై నేను ఎప్పుడూ రియాక్ట్‌ కాలేదు..

  • షర్మిల మా కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు..

  • మా ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయి..

  • రాబోయే రోజుల్లో ఆమెకు నా సపోర్ట్‌ పూర్తిగా ఉంటుంది..

  • షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత..

  • కాంగ్రెస్‌ సీఎంగా నాపై ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి


లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

09:00 PM : నాకు జగన్‌ నుంచి ఫోన్‌ రాలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

  • అధికారం అండగా లేకుంటే..

  • కాంగ్రెస్‌ను ఎదుర్కోలేమని కేసీఆర్ అనుకుంటున్నారు..

  • బీజేపీని కాదని ప్రతిపక్షాలు మనుగడ సాధించలేకపోతున్నాయి..

  • సమస్యలు రాకుండా ఉంటాయని బీజేపీతో కేసీఆర్ కలిసిపోవొచ్చు..

  • BRSతో పొత్తు ఉంటే గెలవొచ్చని బీజేపీ నేతలు అనుకుంటున్నారు..

  • ఏపీ, తెలంగాణలో బీజేపీ పొత్తులు పెట్టుకోవాలని చూస్తుంది..

  • జగన్‌తో పర్సనల్‌గా నాకు ఎలాంటి వైరం లేదు..

  • నాతో మాట్లాడిన ఎంపీలకు సీట్లు ఇవ్వకపోతే..

  • మా షర్మిలమ్మ ద్వారా ఏపీలో వారికి సీట్లు ఇప్పిస్తాం..

  • మోదీ ప్రధాని కావాలని జగన్‌ అనుకుంటున్నారు..

  • నేను రాహుల్‌ ప్రధాని కావాలని అనుకుంటున్నాను..

  • మా ఇద్దరి దారులు, ఆలోచనలు వేరు: సీఎం రేవంత్‌రెడ్డి


08: 50 PM : పార్లమెంట్‌ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

  • నెల రోజులపాటు ఏ రకంగా పాలన చేశామో..

  • భవిష్యత్‌లోనూ అలాగే ముందుకెళ్తాం..

  • కాంగ్రెస్‌ పాలన 6 గ్యారంటీలతో ఓటు అడగాలని నేను అనుకుంటున్నా..

  • ప్రజలు పార్లమెంట్‌ ఎన్నికల్లో మాకు అండగా ఉంటారని అనుకుంటున్నా..

  • బీజేపీ, BRS పరోక్షంగా పొత్తు పెట్టుకుంటాయి..

  • ప్రత్యక్షంగా వాళ్లు పొత్తు పెట్టుకుంటే ఇంకా మేలు కలుగుతుంది..

  • తెలంగాణ ప్రజలకు కూడా బీజేపీ, బీఆర్ఎస్‌ వ్యవహారం తెలుస్తుంది..

  • బీజేపీ, BRS కలిస్తే ఏం చెప్పి వాళ్లు ఓట్లు అడుగుతారు..

  • ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే..

  • కేసీఆర్ ఆటలో అరటిపండులాగా మిగిలిపోతారు: సీఎం రేవంత్‌రెడ్డి


08: 45 PM : సీఎం పదవిని చాలా మంది ఆశించినా నేనేమీ ఫీల్‌ కాలేదు : రేవంత్‌రెడ్డి

  • పార్టీ ఎమ్మెల్యేలు, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాను..

  • ఏ రకంగా చూసినా నాకు అన్ని అంశాలు కలిసొచ్చాయి..

  • కేసీఆర్‌ అన్ని పార్టీల నేతలను తీసుకున్నా..

  • పదేళ్ల తర్వాత ప్రతిపక్షంలోకి రాలేదా? : సీఎం రేవంత్‌రెడ్డి

  • తప్పుడు మార్గాలను ఎంచుకోవాలని నేను అనుకోవడం లేదు..

  • ఫిరాయింపులను ప్రోత్సహించాలని చూడటం లేదు..

  • ప్రతిపక్షం ఫిరాయింపుల గేమ్‌ స్టార్ట్‌ చేస్తే..

  • అప్పటి పరిస్థితులను బట్టి గేమ్‌ మారుతుంది..

  • అలాంటి చర్యలు తెలంగాణలో జరగకూడదని చూస్తున్నా..

  • ప్రజలు ఇచ్చిన తీర్పుకు బీఆర్ఎస్‌ కట్టుబడి ఉంటుందని అనుకుంటున్నా : సీఎం రేవంత్‌రెడ్డి


లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

08: 40PM : ఆ రోజు ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం: రేవంత్‌రెడ్డి

  • అధికారంలోకి వస్తామని 100 శాతం నమ్మా: సీఎం రేవంత్‌రెడ్డి

  • మేం ప్రభుత్వం ఏర్పాటుచేస్తానని ముందే చెప్పడానికి.. రాహుల్‌ గాంధీనే కారణం..

  • రాహుల్‌ గాంధీకి తెలంగాణపై పూర్తిస్థాయి స్పష్టత ఉంది..

  • వార్‌జోన్‌లో ఉన్నప్పుడు క్యాడర్‌కు ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత నాదే..

  • అందుకే అధికారంలోకి వస్తున్నామని ముందే చెప్పా..

  • డిసెంబర్‌9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాం..

  • అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేలు పోడియం దగ్గరకు వచ్చినా..

  • సస్పెండ్‌ చేయోద్దని నేనే చెప్పా..

  • వాళ్లు చేసిన పాపాలు వినడమే వాళ్లకు పెద్ద శిక్ష: సీఎం రేవంత్‌రెడ్డి


లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

08: 35PM : కేసీఆర్‌ పదేళ్లు సీఎంగా ఉండగా అంబులెన్స్‌ అవసరం రాలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

మాజీ అయ్యాక అంబులెన్స్‌ అవసరం అయింది..

వెంటనే గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేయించా..

నాకు చాలా ఎమోషన్స్‌ ఉన్నా, ఇష్టాఇష్టాలు ఉన్నా..

కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి పరామర్శించా..

కేసీఆర్‌ నన్ను అరెస్ట్‌ చేయించారని, నన్ను ఇష్టపడరని..

నాలో వ్యతిరేక భావన లేదు: సీఎం రేవంత్‌రెడ్డి


లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

08: 20PM : యంగ్‌స్టార్‌గా సీఎం వచ్చాడని కేంద్ర పెద్దలు చూశారు: సీఎం రేవంత్‌రెడ్డి

  • హైకోర్టు సీజేను కలిసి పెండింగ్‌ అంశాలపై చర్చించా: సీఎం రేవంత్‌రెడ్డి

  • హైకోర్టు నూతన భవనాల నిర్మాణానికి కొత్త స్థలాలను కేటాయించాం..

  • బాధ్యత కలిగిన వారు ప్రతి అంశాలన్ని రాజకీయ కోణంలో చూడరు..

  • కేంద్ర పెద్దలను కలిసిన తర్వాత ఈ విషయం స్పష్టమైంది..

  • హంగూ ఆర్భాటం లేకుండా వెళ్లడాన్ని వాళ్లు మెచ్చుకున్నారు..

  • రాహుల్‌ గాంధీతో అన్ని విషయాలను చర్చించా: సీఎం రేవంత్‌రెడ్డి


లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

08:10 PM : తప్పుడు నిర్ణయంతో రాష్ట్రానికి నష్టం జరిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

  • కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించాం: రేవంత్‌రెడ్డి

  • సహకారం అందించాలని నిర్మలా సీతారామన్‌ను కలిశాం..

  • కేంద్రం సహకారం కోసమే మంత్రులను కూడా కలిశాం..

  • గవర్నర్‌ తమిళిసైను కూడా కలిసి గతం గత..

  • పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరాం: సీఎం రేవంత్‌రెడ్డి


08:00 PM : ప్రభుత్వం ఏర్పడుతుందని ముందే చెప్పా : రేవంత్ రెడ్డి

  • నెల రోజుల పాలన బాగానే సాగిందని అనుకుంటున్నా: సీఎం రేవంత్‌రెడ్డి

  • పక్షపాతం లేకుండా పాలన చేయాలనుకుంటున్నా..

  • మా దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించాలని అనుకుంటున్నా ..

  • రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో తెలంగాణ శకటం ఉంటుంది..

  • ప్రధాని మోదీతో మాట్లాడి శకటం ప్రదర్శించేలా చేయగలిగా..

  • ప్రధానిని కలిశాక అదనంగా ఐపీఎస్‌లను కేటాయించాలని కోరా..

  • అందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు: సీఎం రేవంత్‌రెడ్డి


07:55 PM : అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అయిది : రేవంత్ రెడ్డి

  • ప్రమాణ స్వీకారం రోజు హడావుడి వల్ల రాలేకపోయా..

  • జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకూ బాధ్యతలు మారుతూ వచ్చాయి...

  • ఎంపీగా గెలిచిన తర్వాత అవగాహన పూర్తిగా మారింది..

  • కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో ఉంటూ అనేక విషయాలు నేర్చుకున్నా..


07:49 PM : ప్రారంభమైన రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ..

  • ఏబీఎన్‌తో రేవంత్‌రెడ్డి తొలిసారి ఇంటర్వ్యూ

  • సీఎం అయ్యాక మొదటి ఇంటర్వ్యూ ఏబీఎన్‌కే ఇచ్చిన రేవంత్

  • ఎన్నికలకు ముందు బిగ్ డిబేట్‌లో తొలి ఇంటర్వ్యూ ఏబీఎన్‌కేనని మాటిచ్చిన సీఎం

  • నాడు ఎంపీగా.. నేడు సీఎంగా ఏబీఎన్‌కు బిగ్ డిబేట్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి


లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. పైగా పోటా పోటీగా తెలుగు ప్రముఖ చానెల్స్, దినపత్రికలు ఇంటర్వ్యూల కోసం పోటీ పడినప్పటికీ.. ఎన్నికల ముందు ‘బిగ్ డిబేట్‌’లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. బిగ్ డిబేట్ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఒక టాప్ ప్రోగ్రామ్.. అలాంటిది ఇక రేవంత్ రెడ్డి తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే.. డిబేట్ ఏ రేంజ్‌లో ఒక్కసారి ఊహించుకోండి. రేవంత్‌తో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ డిబేట్ అనేసరికి ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా..? అని కోట్లాది మంది జనాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చానెల్ ప్రేక్షకులు ప్రోగ్రామ్ కోసం శనివారం ఉదయం నుంచే టీవీలు, యూట్యూబ్‌కు అతుక్కుపోయారు.

రండి.. రారండి.. చూసేయండహో..!

ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో కొత్త సీఎం ఏమేం మాట్లాడుతారు..? ఏబీఎన్ ఎండీ ఆర్కే ఏమేం ప్రశ్నలు సంధిస్తారు..? సీఎం ఎలాంటి సమాధానాలు ఇస్తారని తెలుగు ప్రజలు ఎదురుచూపుల్లో ఉన్నారు. అంతేకాదు.. తెలంగాణ మంత్రులు, మాజీ మంత్రులు సైతం ఈ ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్‌ గురించి డిబెట్‌లో ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయి..? ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ రెడ్డి గురించి ఎలాంటి ప్రశ్నలు.. ఆర్కే అడుగుతారు..? అని వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా.. అసలు కాంగ్రెస్‌ గెలుపునకు దోహదపడిందేంటి..? రేవంత్ రెడ్డినే సీఎంగా ఎందుకు హైకమాండ్ ఎందుకు చేసింది..? తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయ యాత్ర ఎలా సాగింది..?. ప్రజల మద్దతు సాధించడంలో కాంగ్రెస్ ఎలా సక్సెస్ అయ్యింది?. కేసిఆర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు రేవంత్ రెడ్డిని ఎందుకు భావించారు?. రేవంత్ నేతృత్వంలో నెలరోజుల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది?. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతోందా?. ప్రజలకు హామీ ఇచ్చినట్టు ఆరు గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేయగలరా?. తెలంగాణ అప్పుల్లో ఉందంటున్న రేవంత్ సర్కార్ ఎలా నెట్టుకొస్తుంది?. పార్టీలో, ప్రభుత్వంలో సీనియర్ నాయకులు రేవంత్‌కు సహకరిస్తున్నారా?. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారుతో సంబంధాలపై రేవంత్ వ్యూహమేంటి?. కాంగ్రెస్ పాలనపై తొలిరోజు నుంచే దాడి మొదలుపెట్టిన బీఆర్ఎస్‌కు రేవంత్ కౌంటర్ ఏంటి?. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి సంగతేంటో చూసేందుకు రేవంత్ సిద్ధమయ్యారా?. కేసీఆర్ కుటుంబం అవినీతిని కక్కిస్తానన్న రేవంత్ దర్యాప్తు జరిపిస్తారా? అనే ప్రశ్నలతో పాటు వందల ప్రశ్నలకు బిగ్ డిబేట్‌లో సమాధానాలు దొరకనున్నాయి. ఇక ఆలస్యమెందుకు ఇదిగో డిబేట్ ఇక్కడే చూసేయండి..

లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 06 , 2024 | 10:36 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising