Viral: పోలీస్ అంకుల్.. మా నాన్నను జైల్లో పెట్టండి.. తన తండ్రిపై పోలీసులకు కంప్లైంట్ చేసిన ఐదేళ్ల బాలుడు!

ABN, Publish Date - Aug 21 , 2024 | 10:05 AM

గతంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు వినయ విధేయతలతో ఉండేవారు. తల్లిదండ్రులకు ఎదురు చెప్పడానికి భయపడేవారు. ఇప్పటి సోషల్ మీడియా యుగంలో పిల్లల తీరు చాలా మారిపోయింది. చిన్న వయసులోనే ఎన్నో విషయాలు తెలిసిపోతున్నాయి. తల్లిదండ్రులకే గుణపాఠం చెప్పడానికి పిల్లలు సిద్ధమవుతున్నారు.

Viral: పోలీస్ అంకుల్.. మా నాన్నను జైల్లో పెట్టండి.. తన తండ్రిపై పోలీసులకు కంప్లైంట్ చేసిన ఐదేళ్ల బాలుడు!
5-year-old child complaints against his father

గతంలో తల్లిదండ్రుల (Parents) పట్ల పిల్లలు (child) వినయ విధేయతలతో ఉండేవారు. తల్లిదండ్రులకు ఎదురు చెప్పడానికి భయపడేవారు. ఇప్పటి సోషల్ మీడియా యుగంలో పిల్లల తీరు చాలా మారిపోయింది. చిన్న వయసులోనే ఎన్నో విషయాలు తెలిసిపోతున్నాయి. తల్లిదండ్రులకే గుణపాఠం చెప్పడానికి పిల్లలు సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ ఐదేళ్ల బాలుడు తన తండ్రిపై ఫిర్యాదు చేయడానికి ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ధార్‌కు చెందిన ఓ బాలుడు చేసిన పని చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది (Viral News).


ధార్‌కు చెందిన హాస్నైన్ అనే చిన్న పిల్లవాడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన తండ్రి ఇక్బాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆ కుర్రాడి ఫిర్యాదు విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. తన తండ్రి తనను రోడ్డుపై తిరగనివ్వడం లేదని, నది తీరానికి వెళ్లేందుకు అనుమతించడం లేదని పోలీసులకు చెప్పాడు. తన తండ్రిని వెంటనే అరెస్ట్ చేసి జైళ్లో పెట్టాలని కోరాడు. ఆ కుర్రాడి ఫిర్యాదు విని పోలీసులు పగలబడి నవ్వుకున్నారు.


తన తండ్రి సహాయంతోనే పోలీస్ స్టేషన్‌కు చెరుకున్న ఆ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``వీడియో చాలా క్యూట్‌గా ఉంది``, ``ఇది వీడియో కోసం చేసిందే అయినా.. ఆ కుర్రాడి ధైర్యం గొప్పది``, ``ఆ వయసులో నేను పోలీసులను చూస్తే పారిపోయేవాడిని, ఈ కుర్రాడు పోలీసుల ముందు కూర్చుని ధైర్యంగా మాట్లాడుతున్నాడు`` అంటూ కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ట్రక్ డ్రైవరే కానీ, మహానుభావుడు.. ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఇతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే..

Picture Puzzle: మీ కళ్ల సామర్థ్యాన్ని చెక్ చేసుకోండి.. ఈ ఫొటోలో చెర్రీల మధ్యనున్న టమాటాను 8 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఈ దొంగ తెలివితేటలకు షాకవ్వాల్సిందే.. లోపలికి రాకుండా ఏటీఎమ్‌ను ఎలా లూటీ చేశాడో చూడండి..!


Viral Video: రోడ్డు మీద బైకర్‌కు షాకింగ్ అనుభవం.. ఓ ఎద్దు ఎలా చుక్కలు చూపించిందో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 23 , 2024 | 06:24 PM

Advertising
Advertising
<