Viral Video: ``మ్యాచ్ ది ఫాలోయింగ్``లో ఆరేళ్ల బాలిక పొరపాటు.. దిగ్గజ ఆటగాడి రిప్లై ఏంటో తెలిస్తే..!
ABN, Publish Date - Mar 22 , 2024 | 03:32 PM
తాజాగా ఓ ఆరేళ్ల బాలిక చేసిన ఓ పొరపాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి టెన్నిస్ స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ కూడా ఫన్నీగా స్పందించడం గమనార్హం.
చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ``మ్యాచ్ ది ఫాలోయింగ్``ను (Match the following) అందరూ చేసే ఉంటారు. ఎదురెదురుగా ఉన్న వాటిల్లో సరిపోలే వాటిని జత చేయడమే ఈ ``మ్యాచ్ ది ఫాలోయింగ్``. తాజాగా ఓ ఆరేళ్ల బాలిక చేసిన ఓ పొరపాటు సోషల్ మీడియాలో వైరల్ (Viral Mistake) అవుతోంది. దీనికి టెన్నిస్ స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ (Leander Paes) కూడా ఫన్నీగా స్పందించడం గమనార్హం. ఆ పాప టెక్ట్స్ బుక్‌లో సెలబ్రిటీలు, వారు ఏ రంగానికి చెందిన వారో గుర్తించే ``మ్యాచ్ ది ఫాలోయింగ్`` ఉంది.
లతా మంగేష్కర్ గాయని అని, విరాట్ కోహ్లీ క్రికెటర్ అని ఆ బాలిక సరిగ్గానే గుర్తించింది. అయితే లియాండర్ పేస్, ప్రభుదేవా విషయంలో ఆ బాలిక గందరగోళానికి గురైంది. లియాండర్ పేస్‌ను డ్యాన్సర్‌గా, ప్రభుదేవాను టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తించింది. ఆ బాలిక మామ సోషల్ మీడియాలో ఆ ఫొటోను పోస్ట్ చేశాడు. ``తన మేనకోడలు టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌ను డ్యాన్సర్‌గా గుర్తించింద``ని కామెంట్ చేశాడు. ఆ బాలిక చేసిన క్యూట్ మిస్టేక్ చాలా మందికి నవ్వు తెప్పించింది.
Puzzle: మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో ఉన్న రెండో వేటగాడిని కనిపెట్టండి..!
ఈ పోస్ట్ వైరల్ అయి టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ వరకు వెళ్లింది. దీంతో పేస్ ఆ పోస్ట్‌కు ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ పాపులర్ సాంగ్ ``ఓ జానే జానా`` వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ ముఖంపై పేస్ ముఖం సూపర్ ఇంపోజ్ చేసి ఉంది. ఆ వీడియోకు ``రూమర్స్ అన్నీ నిజమే`` అంటూ పేస్ కామెంట్ చేశాడు. లియాండర్ పేస్ రిప్లైపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
Updated Date - Mar 22 , 2024 | 03:32 PM