ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: 32 ఏళ్లుగా సముద్రంలో తేలియాడుతున్న బాటిల్.. అందులోని లేఖలో ఏముందో తెలిసి..

ABN, Publish Date - Feb 05 , 2024 | 05:18 PM

మీకు శివమణి సినిమా తెలిసు కదా.. అందులో కథానాయిక.. కథానాయకుడి నుంచి విడిపోయే సమయంలో ఓ చిన్న కాగితం ముక్కలో ఏదో రాసి దానిని సీసాలో భద్రంగా దాచి సముద్రంలో విసిరేస్తుంది.

మీకు శివమణి సినిమా తెలిసు కదా.. అందులో కథానాయిక.. కథానాయకుడి నుంచి విడిపోయే సమయంలో ఓ చిన్న కాగితం ముక్కలో ఏదో రాసి దానిని సీసాలో భద్రంగా దాచి సముద్రంలో విసిరేస్తుంది. ఆ సీసా మరో కథానాయికకు దొరకడంతో ఆమె ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. చివరికి ఇద్దరినీ కలుపుతుంది. ఇదీ సినిమా స్టోరీ. కానీ.. ఈ రీల్ స్టోరీనే రియల్ గా జరిగింది. చాలా సార్లు సముద్ర తీరంలో దశాబ్దాల క్రితం నాటి వస్తువులు లభిస్తుంటాయి. అలాగే ఇటీవల న్యూయార్క్‌లోని షిన్నెకాక్ బేలో ఇలాంటిదే ఒక వస్తువు కనిపించింది. ఇది ఒక గాజు సీసా. ఇది గత 32 ఏళ్లుగా సముద్రంలో తేలియాడుతున్నది. అయితే ఆ సీసాలో ఓ లెట్టర్ కూడా ఉంది. ఉత్తరం రాసిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఎవరో బాటిల్ సీల్ చేసి అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరేశారు.

న్యూయార్క్‌లోని మాటిటక్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న షాన్, బెన్నీ అనే విద్యార్థులు 1992లో ఈ లేఖ రాశారు. విద్యార్థులు ఈ బాటిల్‌ను ఎర్త్ సైన్స్ ప్రాజెక్ట్‌గా లాంగ్ ఐలాండ్ సమీపంలోని అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరారు. లేఖలో విద్యార్థులు కొన్ని ప్రశ్నలు రాసి వాటిని పూరించాలని కోరారు. అనంతరం ఆ వివరాలను ఈ చిరునామాకు పంపించాలని స్కూల్ అడ్రస్ రాశారు. ఈ సీసాను ఆడమ్ ట్రావిస్ అనే వ్యక్తి షిన్నెకాక్ బేలో కనుగొన్నాడు. అనంతరం వాటిని ఫొటోలు తీసి మాటిటక్ హైస్కూల్ అలుమ్ని అనే ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశాడు.


లేఖ రాసిన విద్యార్థుల్లో ఒకరైన బెన్నీ డోరోస్కీ ఈ పోస్ట్‌ను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బాటిల్ సందేశం వైరల్ గా మారింది. అప్పుడు మేము విద్యార్థులం. కానీ ఇప్పుడు పెద్దవాళ్లమైపోయాం. 32 ఏళ్ల తర్వాత ఇది మా దగ్గరికి రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని బెన్నీ అన్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 05:18 PM

Advertising
Advertising