Alaska Airlines: విమాన ప్రయాణంలో శునకం మృతి.. యజమాని ఏం చేశాడంటే
ABN, Publish Date - Oct 28 , 2024 | 08:00 AM
ఇటీవల న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించిన ‘అలాస్కా ఎయిర్‌లైన్స్’ విమానంలో బాధాకరమైన ఘటన జరిగింది. సరిగా ఊపిరి ఆడక ఒక ఫ్రెంచ్ బుల్ డాగ్ చనిపోయింది. తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క ‘యాష్’ చావుకు విమానయాన సంస్థే కారణమని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే అది మృతి చెందిందంటూ మైఖెల్ కాంటిల్లో అనే వ్యక్తి ఎయిర్‌లైన్స్‌పై దావా వేశాడు.
ఇటీవల న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించిన ‘అలాస్కా ఎయిర్‌లైన్స్’ విమానంలో బాధాకరమైన ఘటన జరిగింది. సరిగా ఊపిరి ఆడక ఒక ఫ్రెంచ్ బుల్ డాగ్ చనిపోయింది. తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క ‘యాష్’ చావుకు విమానయాన సంస్థే కారణమని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే అది మృతి చెందిందంటూ మైఖెల్ కాంటిల్లో అనే వ్యక్తి ఎయిర్‌లైన్స్‌పై దావా వేశాడు. ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యమే శునకం ప్రాణాలు తీసిందని అతడు వాపోయాడు.
ప్రయాణ సమయంలో అనువుగా ఉండేందుకు రెండు ఫ్రెంచ్ బుల్ డాగ్స్ ‘యాష్’, ‘కోరా’ల కోసం ఫస్ట్-క్లాస్ టిక్కెట్లు కొనుగోలు చేశామని కాంటిల్లో చెప్పాడు. ‘‘ నేను, మా నాన్న కలిసి ఫస్ట్-క్లాస్ టిక్కెట్లు బుక్ చేశాం. ప్రయాణానికి ముందు ఈ రెండు శునకాలను పశువైద్యుడు కూడా పరీక్షించారు. శునకాలకు ఇబ్బంది లేదని ప్రయాణించవచ్చన్నారు. కానీ అలాస్కా ఎయిర్‌లైన్స్ సిబ్బంది భద్రతా కారణాలను చెప్పి ప్రయాణికులు, వారి పెంపుడు జంతువులను విమానంలో మరింత వెనక కూర్చోవాలని పట్టుబట్టారు. అకస్మాత్తగా సీటు మారడంతో యాష్‌కు తీవ్ర ఇబ్బంది కలిగింది. సీటు మారిన తర్వాత యాష్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది’’ అని కాంటిల్లో చెప్పాడు.
ఇక ఎయిర్‌లైన్ నిబంధనల కారణంగా టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో తన యాష్‌ని పర్యవేక్షించలేకపోయానని క్యాంటిల్లో పేర్కొన్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత చూస్తే యాష్ చనిపోయిందని అతడు వాపోయాడు.
వ్యాజ్యంలో ఏం పేర్కొన్నాడంటే....
అలాస్కా ఎయిర్‌లైన్స్‌పై దాఖలు చేసిన వ్యాజ్యంలో క్యాంటిల్లో పలు ఆరోపణలు గుప్పించాడు. విమాన ప్రయాణంలో శ్వాసకోశ సమస్యలకు గురయ్యే ‘బ్రాచైసెఫాలిక్’ అనే జాతి ఫ్రెంచ్ బుల్ డాగ్స్‌కు కావాల్సిన అవసరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఎయిర్‌లైన్ విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఇక సరైన కారణం లేకుండా ప్రయాణికులను ఫస్ట్ క్లాస్ నుంచి వెనుక తరలించి టికెట్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అన్నారు. జంతువులను నిర్వహించడంలో ఎయిర్‌లైన్ సిబ్బందికి సరైన శిక్షణ లేదని క్యాంటిల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు ఉన్న జంతులను చూసుకోవడం తెలియదని పేర్కొన్నాడు.
కాగా నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ అలాస్కా ఎయిర్‌లైన్స్ ఆర్థిక పరిహారం చెల్లించాలంటూ క్యాంటిల్లో కోరాడు. పెంపుడు జంతువును కోల్పోవడం వల్ల కలిగే మానసిక క్షోభపై ఎయిర్‌లైన్స్ కనీసం సానుభూతి చూపలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బ్రాచైసెఫాలిక్ జాతులకు చెందిన బుల్ డాగ్స్‌కు విమాన ప్రయాణంలో శ్వాసకోశ సమస్యలు దారితీసే అవకాశం ఉందని అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ జాతుల శునకాలను ప్రయాణీకుల క్యాబిన్‌లో ఉంచాలని, కార్గోకు లేదా ఇరుకైన పరిమిత ప్రదేశంలో రవాణా చేయకూడదని సూచనలు చేసింది.
ఇవి కూడా చదవండి
ఆ కాలంపోయింది.. కివీస్ చేతిలో భారత్ ఓటమిపై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్ పూర్తి చేసిన బీజేపీ ఎంపీ.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే
For more Viral News and Telugu News
Updated Date - Oct 28 , 2024 | 09:00 AM