ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: విమానంలో విచిత్ర ఘటన.. సీట్లో కూర్చోకుండా నేరుగా క్యాబిన్ డోర్ తెరిచిన ప్రయాణికుడు.. చివరకు..

ABN, Publish Date - Jan 13 , 2024 | 01:56 PM

విమాన ప్రయాణంలో కొన్నిసార్లు విచిత్ర ఘగనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు తెలిసీతెలీక చేస్తే.. మరికొందరు మద్యం మత్తులో, ఇంకొందరు కావాలనే చేస్తూ చివరకు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి ..

విమాన ప్రయాణంలో కొన్నిసార్లు విచిత్ర ఘగనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు తెలిసీతెలీక చేస్తే.. మరికొందరు మద్యం మత్తులో, ఇంకొందరు కావాలనే చేస్తూ చివరకు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, టొరంటోలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విమానం ఎక్కిన ఓ వ్యక్తి తన సీట్లో కూర్చోకుండా ఏకంగా క్యాబిన్ డోరే తెలిచాడు. దీంతో చివరకు ఏం జరిగిందంటే..

టొరంటోలోని (Toronto) పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దుబాయ్‌కి ఎయిర్ కెనాడా విమానంలోకి (Air Canada flight) ప్రయాణికులంతా ఎక్కి కూర్చుకున్నారు. అయితే ఓ ప్రయాణికుడు తన సీటుకు వెళ్లకుండా (Passenger opened airplane cabin door).. క్యాబిన్ తలుపులను తెలిచాడు. అంతా చూస్తుండగానే పైనుంచి దూకేశాడు. సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి ఆ ప్రయాణికుడు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

గమనించిన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, చికిత్సం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారిస్తున్నారు. అయితే సదరు వ్యక్తి ఎవరు, ఇంతకీ అతను క్యాబిన్ తలుపులు ఎందుకు తీశాడు తదితర వివరాలు తెలియాల్సింది ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని ఎయిర్‌లెన్స్ అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటన కారణంగా దుబాయ్‌కి వెళ్లాల్సిన విమానం దాదాపు ఆరు గంటలపాటు ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Updated Date - Jan 13 , 2024 | 01:56 PM

Advertising
Advertising