Viral: మెడలో చెప్పుల దండ వేసుకుని ప్రచారం చేస్తున్న అభ్యర్థి.. కారణం ఏంటో తెలిస్తే..!
ABN, Publish Date - Apr 09 , 2024 | 06:49 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ అలుముకుంది. అభ్యర్థులందరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఓ అభ్యర్థి ప్రచారం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ అలుముకుంది (Elections 2024). అభ్యర్థులందరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) అలీగఢ్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఓ అభ్యర్థి ప్రచారం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఆ అభ్యర్థి తన మెడలో చెప్పుల దండ వేసుకుని నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. ఆ ఘటన చాలా మందిని ఆకట్టుకుంటోంది (Loksabha Elections 2024).
అలీగఢ్ (Aligarh) ప్రాంతానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ దేవ్ త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనకు ఎన్నికల సంఘం చెప్పుల గుర్తును కేటాయించింది. దీంతో ఆయన తన మెడలో చెప్పుల దండ వేసుకుని చెప్పుల గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు (Slippers garland). ప్రజలకు తన ఎన్నికల గుర్తు మరపురాకూడదనే ఉద్దేశంతో మెడలో చెప్పుల దండ వేసుకుని నగరంలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.
కేశవ్ దేవ్ గత ఎన్నికల్లో అలీగఢ్ అసెంబ్లీకి కూడా పోటీ చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బూట్ల దండను మెడలో వేసుకుని ప్రచారం సాగించారు. అవినీతి నిరోధక సేన జాతీయ అధ్యక్షుడు అయిన పండిట్ కేశవ్ దేవ్ ప్రతి ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేస్తుంటారు. అలీగఢ్‌లో ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Opitcal Illusion: మీ కళ్లకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలోని కుక్కను 10 సెకెన్లలో కనిపెట్టండి..!
ఎన్నికల వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 09 , 2024 | 06:49 PM