ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mukesh Ambani: అంబానీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా.. కాబోయే కోడలికి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌లు ఇవే!

ABN, Publish Date - Feb 23 , 2024 | 04:37 PM

ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. రాధికా మర్చంట్‌ను అనంత్ పెళ్లాడబోతున్నాడు. ఈ నేపథ్యంలో చిన్న కోడలికి అంబానీ ఇచ్చిన ఖరీదైన బహుమతుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ముఖేష్ అంబానీ (Mukesh Ambani) పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ 2019లో శ్లోకా మెహతాను వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో శ్లోకాకు అంబానీ కుటుంబం రూ.451 కోట్ల విలువైన నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌లలో ఒకటైన ``మౌవాద్ ఎల్'ఇన్‌కాంపరబుల్‌``ను కోడలికి బహుమతిగా ఇచ్చారు. త్వరలో ముఖేష్ చిన్న కొడుకు అనంత్ అంబానీ (Anant Ambani)కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. రాధికా మర్చంట్‌ను (Radhika Merchant) అనంత్ పెళ్లాడబోతున్నాడు.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలకు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల అధిపతులు హాజరుకాబోతున్నారు. కాగా, కాబోయే కోడలు రాధికా మర్చెంట్‌కు అంబానీ కుటుంబం ఇప్పటివరకు ఇచ్చిన బహుమతుల గురించి చర్చ జరుగుతోంది. రాధిక, అనంత్ అంబానీ గతేడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సందర్భంగా కాబోయే కోడలికి ముఖేష్ అంబానీ రూ. 4.5 కోట్ల విలువైన బెంట్లీ కారును బహుమతిగా ఇచ్చారు.

రాధిక మర్చంట్‌ను నీతా అంబానీ అందమైన వెండి లక్ష్మీ-గణేష్ విగ్రహాలతో కుటుంబంలోకి స్వాగతించారు. అలాగే రెండు వెండి తులసి కుండీలు, వెండి అగరబత్తి స్టాండ్, లక్ష్మీ-గణేష్ విగ్రహం ఉన్నాయి. అలాగే పెద్ద కోడలికి ఇచ్చినట్టుగానే రాధికకు కూడా అత్యంత విలువైన నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారట. కాగా, నీతాలాగానే రాధిక కూడా శిక్షణ పొందిన భరతనాట్య నర్తకి. గురు భావనా ​​థాకర్ మార్గదర్శకత్వంలో రాధిక తన శాస్త్రీయ నృత్య శిక్షణను పూర్తి చేసింది.

Updated Date - Feb 23 , 2024 | 04:37 PM

Advertising
Advertising