ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Missing Case: 26 ఏళ్ల క్రితం తప్పిపోయాడు.. తీరా చూస్తే 200 మీటర్ల దూరంలోనే..

ABN, Publish Date - May 15 , 2024 | 09:43 AM

అనుకోకుండా తప్పిపోయిన వ్యక్తులు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడం వంటి ఘటనలు ఇదివరకే ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా సౌతాఫ్రికాలోని అల్జీరియా దేశంలోనూ..

అనుకోకుండా తప్పిపోయిన వ్యక్తులు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడం వంటి ఘటనలు ఇదివరకే ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా సౌతాఫ్రికాలోని అల్జీరియా దేశంలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది కానీ, ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఇతర సంఘటనల్లో ఇంటి నుంచి పారిపోవడమో, లేక ఎక్కడో తప్పిపోవడం వల్లనో కుటుంబానికి దూరమైతే.. అల్జీరియా ఘటనలో మాత్రం కిడ్నాప్ కోణం తెరమీదకి వచ్చింది. పైగా.. ఆ బాధితుడు ఇంటి నుంచి కేవలం 200 మీటర్లలోనే ఉండి కూడా దొరక్కపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేసే విషయం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశారు.. చెల్లెమ్మా అంటూ దగ్గరయ్యారు.. చివరికి?

1998లో అల్జీరియన్ అంతర్యుద్ధం (Algerian Civil War) సమయంలో డిజెల్ఫా (Djelfa) నగరంలో నివాసముండే ‘బీ ఒమర్’ అనే యువకుడు తప్పిపోయాడు. అప్పుడు అతని వయసు 19 సంవత్సరాలు. అతడు తప్పిపోయినప్పుడు కుటుంబసభ్యులు ఎంతగానో వెతికారు. బంధువులు, స్నేహితులను సంప్రదించినా అతని ఆచూకీ దొరకలేదు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినా.. ఒమర్ దొరకలేదు. దీంతో.. అతడు కిడ్నాప్ గురై ఉంటాడని లేక చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. అటు.. పోలీసులు సైతం అతడ్ని వెతకడం ఆపేశారు. కానీ.. కుటుంబ సభ్యులు మాత్రం వెనకడుగు వేయలేదు. ఏదో ఒక రోజు అతని ఆచూకీ లభిస్తుందన్న ఉద్దేశంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈ ప్రయత్నాల్లో భాగంగానే.. ఒమర్ సోదరుడు సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టాడు. 1998లో ఒమర్ తప్పిపోయాడని, ఇంతవరకూ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఈ తరుణంలోనే.. వాళ్లు ఇంటి నుంచి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న గడ్డివాముల మధ్య ఒమర్ కనుగొనబడ్డాడు. ఇప్పుడు అతని వయసు 45 సంవత్సరాలు. డోర్‌మ్యాన్ (61 ఏళ్లు) తనని కిడ్నాప్ చేసి ఇంట్లో బందీగా ఉంచాడని.. చిత్రహింసలకు గురి చేశాడని.. అందుకే తాను సహాయం కోసం పిలవలేకపోయానని ఒమర్ తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు.. డోర్‌మ్యాన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Latest Viral News and Telugu News

Updated Date - May 15 , 2024 | 09:43 AM

Advertising
Advertising