ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: పంట పొలాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్.. కూలీలు ఏం చేశారో చూడండి

ABN, Publish Date - Sep 05 , 2024 | 09:04 PM

ఆకాశంలో ఎక్కడో చిన్న పక్షి మాదిరిగా.. మహా అయితే ఇంకాస్త పెద్దదిగా కనిపించే హెలికాప్టర్ అకస్మాత్తుగా వచ్చి పక్కనే ల్యాండ్ అయితే?.. ఎలా ఉంటుందో ఊహించగలరా!!. నల్లొండ జిల్లా చిట్యాలకు చెందిన కొంత రైతు కూలీలకు ఇదే అనుభవం ఎదురైంది.

ఆకాశంలో ఎక్కడో చిన్న పక్షి మాదిరిగా.. మహా అయితే ఇంకాస్త పెద్దదిగా కనిపించే హెలికాప్టర్ అకస్మాత్తుగా వచ్చి పక్కనే ల్యాండ్ అయితే?.. ఎలా ఉంటుందో ఊహించగలరా!!. నల్లొండ జిల్లా చిట్యాలకు చెందిన కొంత రైతు కూలీలకు ఇదే అనుభవం ఎదురైంది. విజయవాడ నుంచి హకీంపేట్‌ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కి వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన హెలికాప్టర్ ఒకటి నల్గొండ జిల్లాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక సమస్య కారణంగా ఉన్నట్టుండి పంట పొలాల్లోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది.


చిట్యాల శివారు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లోని ముగ్గురు అధికారులు సురక్షితంగా ఉన్నారు. సమాచారం మేరకు మరికాసేపటికే మరో హెలికాప్టర్ వచ్చి అధికారులను అక్కడి నుంచి తరలించింది. అయితే పంట పొలంలో హెలికాప్టర్‌ ల్యాండ్ అవడంతో అక్కడి రైతులు, రైతు కూలీలు అందరూ ఆశ్చర్యపోయారు. హెలికాప్టర్‌ను ఆసక్తిగా చూశారు. హెలికాప్టర్ ముందు ఫొటోలు కూడా దిగారు. కూలీలు హెలికాప్టర్ ముందు కూర్చుని ఫొటోలు దిగారు.


ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా రైతు కూలీలు సాధారణంగా హెలికాప్టర్లు, విమానాలను చూడడం అరుదుగా జరుగుతుంటుంది. మరీ ఇంత దగ్గర నుంచి చూసే అవకాశం మాత్రం అందరికీ రాదు. రోజువారీ పనుల్లో బిజీబిజీగా వారు తమకు అంత దగ్గరకు హెలికాప్టర్ రావడం చూసి తెగ సంబరపడ్డారు.

Updated Date - Sep 05 , 2024 | 09:06 PM

Advertising
Advertising