Watch Video: కశ్మీర్లో హిమపాతంపై ఇద్దరు అమ్మాయిల క్యూట్ రిపోర్టింగ్.. మీరూ చూడండి
ABN, Publish Date - Feb 05 , 2024 | 03:01 PM
జమ్మకశ్మీర్‌లో హిమపాతం కురుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. రక్తం గడ్డకట్టే స్థాయిలో చలి ఉన్నప్పటికీ.. ఆ చల్లని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాంటి అందమైన ప్రదేశంలో ఇద్దరు చిన్నారులు రిపోర్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? మరింత అందంగా, మనసు ఉప్పొంగుతున్న భావన కలుగుతుంది.
జమ్మకశ్మీర్‌లో హిమపాతం కురుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. రక్తం గడ్డకట్టే స్థాయిలో చలి ఉన్నప్పటికీ.. ఆ చల్లని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాంటి అందమైన ప్రదేశంలో ఇద్దరు చిన్నారులు రిపోర్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? మరింత అందంగా, మనసు ఉప్పొంగుతున్న భావన కలుగుతుంది. అటువంటి ఫీలింగ్‌ని కలిగించే ఒక క్యూట్ వీడియోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. చుట్టూ హిమపాతం, చిరుజల్లుల్లా కురుస్తున్న మంచువర్షంలో.. ఇద్దరు అమ్మాయిలు ఎంతో క్యూట్‌గా రిపోర్టింగ్ చేస్తున్న వీడియోని ఆయన షేర్ చేశారు. ‘‘స్నోలో స్లైడింగా లేక స్నోలో షాయరినా? నా ఓటు అయితే రెండో దానికే’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇక ఆ ఇద్దరు అమ్మాయిలు చేసే రిపోర్టింగ్ గురించి మాట్లాడుకుంటే.. ‘‘మొత్తానికి కశ్మీర్లో మంచువర్షం కురవడాన్ని మీరు చూడొచ్చు. నేను ఎంతలా ఎంజాయ్ చేస్తున్నానో మీరు గమనించవచ్చు. నాకైతే స్వర్గంలో విహరిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇన్నాళ్లూ నేను, నా సోదరి చేసిన ప్రార్థనలు ఫలించి.. ఆ దేవుడు మంచువర్షాన్ని కురిపించాడు. మేమిద్దరమైతే ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నాకైతే ఈ హిమపాతంలో మునిగి తేలాలని ఉంది’’ అంటూ ఒక అమ్మాయి చెప్పే మాటలు వింటే ఎవ్వరైనా ఫిదా అవ్వకుండా ఉండలేరు. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ వీడియో చూపరులను ఎంతో ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఇదే ఎన్నో మిలియన్ల వ్యూస్‌తో పాటు వేలాది లైక్స్ సొంతం చేసుకుంది. మీరూ ఈ వీడియోపై ఒక లుక్కేసుకోండి...
Updated Date - Feb 05 , 2024 | 03:01 PM