ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Watch Video: వామ్మో.. గేదెకు కోపం వస్తే ఇలా ఉంటుందా? రోడ్డు మీద జనాలను ఎలా పరుగులు పెట్టించిందో చూడండి..

ABN, Publish Date - Feb 24 , 2024 | 08:06 PM

సాధారణంగా ఆవులు, గేదెలకు మనుషుల పైన దాడి చేసే స్వభావం ఉండదు. అయితే వాటికి తిక్క రేగితే మాత్రం ఎంతటి వారైనా హడలిపోవాల్సిందే.

సాధారణంగా ఆవులు, గేదెలు ఎవరి జోలికీ వెళ్లవు. వాటి యజమాని లేకపోయినా రోడ్డు మీద ఓ పక్కగా నడుచుకుంటూ వెళ్లిపోతాయి. మనుషుల పైన దాడి చేసే స్వభావం వాటికి ఉండదు. అయితే వాటికి తిక్క రేగితే మాత్రం ఎంతటి వారైనా హడలిపోవాల్సిందే. తాజాగా కేరళకు (Kerala) చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ వ్యక్తి రోజూ లాగానే ఇంటి నుంచి స్కూటీపై బయల్దేరాడు. అయితే దురదృష్టవశాత్తూ భయంకర అనుభవం ఎదుర్కొన్నాడు.

కేరళలోని కోచిలో ఈ ఘటన జరిగింది. కోచి (Kochi)లోని ఎయిర్‌పోర్ట్ రోడ్డు మధ్యలో ఓ గేదె (Buffalo) నిల్చుని ఉంది. స్కూటీ మీద ఓ వ్యక్తి ఆ గేదె ముందు నుంచి వెళ్తున్నాడు. తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఆ గేదె ఆ వ్యక్తిని ఢీకొని స్కూటీ మీద నుంచి కింద పడేసింది. అయినా వదలకుండా కింద పడిన వ్యక్తిని కొమ్ములతో కుమ్మేసింది. అతడిని కాపాడడానికి కొందరు ప్రయత్నించారు. వారి వైపు కోపంగా పరిగెత్తుకుంటూ వెళ్లింది. wander_diaries అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోట్లలో వ్యూస్ దక్కించుకుంది. 4.3 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపించారు. ``ఆ గేదెకు ఎందుకంత కోపం వచ్చింది``, ``ఆ గేదెకు పింక్ కలర్ నచ్చలేదేమో``, ``అన్ని వాహనాల మధ్యలో ఆ గేదె భయపడింది``, ``ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మనిషికి ఏమైంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 24 , 2024 | 08:06 PM

Advertising
Advertising