Viral: పాల పొడిలో పొరపాటున మద్యం కలిపి ఇచ్చిన అమ్మమ్మ.. కోమాలోకి 4 నెలల చిన్నారి!
ABN, Publish Date - May 03 , 2024 | 07:21 PM
ఇటలీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలి పొరపాటు కారణంగా నాలుగు నెలల చిన్నారి మరణం అంచుల వరకూ వెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటలీలో (Italy) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలి పొరపాటు కారణంగా నాలుగు నెలల చిన్నారి మరణం అంచుల వరకూ వెళ్లింది. బ్రిండిసీ నగరంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది.
వృద్ధురాలు పొరపాటున తన మనవడి పాల పొడిలో నీళ్లతో పాటు మద్యం కూడా కలిపి పట్టింది. సగం వరకూ తాగిన చిన్నారి ఆ తరువాత మద్యాన్ని తిరస్కరించడంతో ఆమెకు డౌటొచ్చి పాల సీసా వాసన చూడగా మద్యం వాసన వచ్చింది. దీంతో, కంగారు పడిపోయిన వృద్ధురాలు వెంటనే చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించింది. అక్కడి విద్యార్థులు చిన్నారికి అత్యవసర చికిత్స చేయించిన అనంతరం, పెద్దాసుపత్రికి తరలించారు.
Viral: 73 ఏళ్ల భార్యకు ఈ పెద్దాయన ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూడండి.. వైరల్ వీడియో
ఘటన కారణంగా కోమాలోకి వెళ్లిన చిన్నారి ఆ తరువాత ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బాలుడి పరిస్థితి పూర్తిగా పరిశీలించాక అతడి అమ్మమ్మపై కేసు పెట్టాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పోలీసులు తెలిపారు.
కాగా, బ్రిటన్‌లో గతేడాది జరిగిన మరో ఘటనలో ఇద్దరు యువతులు సరదాగా 18 నెలల చిన్నారికి నోటి వద్ద మద్యం బాటిల్ పెట్టి వీడియో రికార్డు చేశారు. వీడియో వైరల్ కావడంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. అయితే, సరదా కోసమే చేశాము తప్ప మరే ఉద్దేశ్యమూ లేదని వారిద్దరూ ఒప్పుకోవడంతో న్యాయస్థానం వారికి జైలు శిక్ష వేయకుండా చిన్న జరిమానాతో సరిపెట్టింది.
Updated Date - May 03 , 2024 | 07:29 PM