ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bike Accident: ``నన్ను రక్షించడానికి ఎంత మంది వచ్చారో``.. వైరల్ అవుతున్న యాక్సిడెంట్ బాధితుడి ఎమోషనల్ లెటర్!

ABN, Publish Date - Mar 18 , 2024 | 07:55 PM

బెంగళూరులో తనకు బైక్ యాక్సిడెంట్ జరిగినపుడు వెంటనే స్పందించి పరిగెత్తుకుంటూ వచ్చిన అపరిచితులకు ఓ వ్యక్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

మనం హృదయపూర్వకంగా ఏ పని చేసినా అది ఎదుటి వారి హృదయాన్ని తాకుతుందని చెబుతుంటారు. బెంగళూరు (Bengaluru)లో జరిగిన అలాంటి ఓ ఘటన చాలా మందిని భావోద్వేగానికి గురి చేస్తోంది. ఓ వ్యక్తి రాసిన కృతజ్ఞతా లేఖ (Thanks Letter) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు బైక్ యాక్సిడెంట్ (Bike Accident) జరిగినపుడు వెంటనే స్పందించి పరిగెత్తుకుంటూ వచ్చిన అపరిచితులకు ఆ వ్యక్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు (Emotional Letter).

ఆదిత్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైనపుడు ఈ ఘటన జరిగింది. రోడ్డుపై కంకర ఉండడంతో అతడి బైక్ అదుపు తప్పింది. దీంతో ఆదిత్య వెనుక కూర్చున్న ప్రయాణికుడితో పాటు రోడ్డుపై పడిపోయాడు. ప్రమాదంలో ఆదిత్య కుడి చేతికి తీవ్ర గాయమైంది. సమీపంలోని వ్యక్తులు బాధితుడికి సహాయం చేసేందుకు పరుగులు తీశారు. ఒకరు బైక్‌ను తీశారు. మరొకరు నీళ్లు అందించారు. ఓ ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా వచ్చి ఆదిత్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. చికిత్స పూర్తయ్యే వరకు హాస్పిటల్‌లోనే ఉన్నాడు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

``అందమైన వ్యక్తులు.. అందమైన నగరం`` అంటూ ఆదిత్య తనకు ఎదురైన అనుభవం గురించి రెడ్డిట్‌లో రాశాడు. ప్రమాదం తర్వాత తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పాడు. ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Letter) మారింది. ``భారత్‌లో మాత్రమే ఇలాంటివి చూడగలం``, ``అలాంటి పరిస్థితిలో ఉన్న ఎవరికైనా చుట్టు పక్కల వారు సహాయం చేస్తారు``, ``ఇది చాలా గొప్ప అనుభవం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 18 , 2024 | 07:55 PM

Advertising
Advertising