Bengaluru: 5555 కేజీల నాణేలతో స్వామీజీకి తులాభారం
ABN, Publish Date - Feb 03 , 2024 | 01:29 PM
తులాభారం సాధారణంగా ఓ వ్యక్తి తూకంతో కొలుస్తారు. బెల్లం, నగదు, ఇతరత్రా వస్తువులను మనిషి బరువుకు సమానంగా ఉం చుతారు. ఏకంగా ఓ ఏనుగుపై స్వామీజీని కూర్చోబెట్టి తులాభారం జరిపి రికార్డు సృష్టించారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): తులాభారం సాధారణంగా ఓ వ్యక్తి తూకంతో కొలుస్తారు. బెల్లం, నగదు, ఇతరత్రా వస్తువులను మనిషి బరువుకు సమానంగా ఉం చుతారు. ఏకంగా ఓ ఏనుగుపై స్వామీజీని కూర్చోబెట్టి తులాభారం జరిపి రికార్డు సృష్టించారు. గదగ్ జిల్లా శిరహట్టి ఫకీర్ సిద్దరామ స్వామీజీ అమృత మహోత్సవంలో ప్రత్యేకమైన తులాభారం జరిగింది. హుబ్బళ్ళి(Hubballi)లోని నెహ్రూ మైదానంలో గురువారం జరిగిన కార్యక్రమంలో 5,555 కేజీల నాణేలతో సిద్దరామ స్వామీజీకి తులాభారం జరిపారు. మూరుసావిర మఠం నుంచి శోభాయాత్ర ఆరంభం కాగా ఐదు ఏనుగులు, ఐదు ఒంటెలు, ఐదు గుర్రాలతో కళాబృందాలు సాగాయి. ఫకీర్ సిద్దరామ స్వామి, దింగాలేశ్వర స్వామిజీ, మూరుసావిర మఠ మూజగు స్వామిజీలతోపాటు వందలాదిమంది మఠాధిపతులు పాల్గొన్నారు. అంబారీపై ఫకీరు సిద్దరామరస్వామిజీని ఆశీనులు చేసి తులాభారం జరిపారు. కేంద్ర ప్రహ్లాద్‌జోషి పరి షత్ సభాపతి బసవరాజ్ హొరట్టి, బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, మాజీ సీఎంలు బసవరాజ్ బొమ్మై, జగదీశ్ శెట్టర్, మంత్రులు ఎంబీ పాటిల్, హెచ్‌కే పాటిల్, ఈశ్వర్‌ఖండ్రె, ఎమ్మెల్యేలు అరవింద బెల్లద్, శ్రీనివాస్‌మానె, సలీం అహ్మద్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. హుబ్బళ్ళికి చెందిన భక్తులు సిద్దరామస్వామిజీ, దింగాలేశ్వరస్వామీజీకి 3 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
Updated Date - Feb 03 , 2024 | 01:29 PM