Viral: ఏడాదికి రూ.30 లక్షల జీతం ఉండాలి.. పేరెంట్స్ ఉండకూడదు.. ఓ వధువు పెట్టిన కండిషన్లు వింటే కళ్లు తేలెయ్యాల్సిందే..
ABN, Publish Date - Sep 16 , 2024 | 10:22 AM
పెళ్లి అంటే ఎన్నో ఊహలు, ఎన్నో ఆలోచనలు, మరెన్నో లెక్కలు ఉంటాయి. గతంలో అమ్మాయిలు తల్లిదండ్రులు చూపించిన వరుడిని మారు మాట్లాడకుండా వివాహం చేసుకునే వారు. కానీ, ఆధునిక అమ్మాయిలు అలా కాదు. వరుడిలో తాము కోరుకునే లక్షణాలను, అతడి జీతాన్ని, అతడి దైనందిన జీవితాన్ని అంచనా వేసుకుని మరీ రంగంలోకి దిగుతున్నారు.
పెళ్లి (Wedding) అంటే ఎన్నో ఊహలు, ఎన్నో ఆలోచనలు, మరెన్నో లెక్కలు ఉంటాయి. గతంలో అమ్మాయిలు తల్లిదండ్రులు చూపించిన వరుడి (Groom)ని మారు మాట్లాడకుండా వివాహం చేసుకునే వారు. కానీ, ఆధునిక అమ్మాయిలు అలా కాదు. వరుడిలో తాము కోరుకునే లక్షణాలను, అతడి జీతాన్ని, అతడి దైనందిన జీవితాన్ని అంచనా వేసుకుని మరీ రంగంలోకి దిగుతున్నారు. వరుడికి ఉండాల్సిన అర్హతల గురించి పెళ్లికి ముందే ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువతి (Bride) ప్రకటించిన జాబితా బాగా వైరల్ అవుతోంది. అది చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు (Viral News).
ఆ మహిళకు అది రెండో వివాహం. అయినా ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 39 ఏళ్ల ఆ యువతి తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన అర్హతల వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు కాబోయే భర్తకు ఏడాదికి 30 లక్షల రూపాయల జీతం ఉండాలని, 3 బీహెచ్‌కే ఇల్లు కావాలని ఆ పోస్ట్‌లో వివరించింది. బీఈడీ చదివిన ఆ యువతి ఏటా రూ.1.3లక్షలు సంపాదిస్తోంది. ఆమెకు ఏడాదికి రూ.30 లక్షల జీతం వచ్చే వరుడు కావాలని పేర్కొంది. భారత్, అమెరికా లేదా యూరప్‌లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని కోరింది. అలాగే మరికొన్ని రిక్వైర్‌మెంట్స్ కూడా ప్రకటించింది.
అలాగే వరుడు కనీసం ఎమ్‌బీఏ లేదా ఎమ్‌ఎస్ చేసి ఉండాలని, అప్పులు ఉండకూడదని, పేరెంట్స్ ఉండకూడదని, ఒకవేళ పేరెంట్స్ ఉంటే పెళ్లయ్యాక వాళ్ల దగ్గర ఉండకూడదని పేర్కొంది. తన తల్లిదండ్రులు మాత్రం తనపైనే ఆధారపడి ఉన్నారని, వారితోనే జీవిస్తానని చెప్పింది. ఇంటి పనులు చేయడానికి పనిమనిషి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కూడా పేర్కొంది. ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న వరుడు ఆన్‌లైన్ ద్వారా తనను సంప్రదించాలని చెప్పింది.
ఇవి కూడా చదవండి..
Picture Puzzle: మీ బ్రెయిన్‌కు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో తప్పు ఎక్కడుందో కనుక్కోండి..
Viral Video: అదృష్టం అంటే ఇదే మరి.. అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..
Viral Video: విధి వక్రించడమంటే ఇదే... వర్షంలో డ్యాన్స్ చేస్తూ వీడియో.. చివరకు ఏం జరిగిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 16 , 2024 | 10:22 AM