Puzzle: ఈ ఫొటోలో తప్పేంటో 8 సెకెన్లలో కనిపెడితే మీ బ్రెయిన్ పవర్ ఫుల్ అని నమ్మొచ్చు..!
ABN, Publish Date - Jun 24 , 2024 | 09:42 AM
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ యువతి టేబుల్ ముందు కూర్చుని ఆహారం తింటోంది. టేబుల్ మీద పాత్రల్లో కాఫీ, సూప్ ఉన్నాయి. ఆ యువతి ఫోర్క్‌తో తింటోంది. అయితే ఈ ఫొటోలో ఓ తప్పు ఉంది. ఆ తప్పేంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 8 సెకెన్ల వ్యవధిలో ఆ తప్పును కనిపెడితే మీ బ్రెయిన్ చాలా పవర్‌ఫుల్ అని నమ్మొచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ యువతి ఫోర్క్‌తో సూప్ తాగడానికి ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 24 , 2024 | 09:42 AM