ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dark Neck: మెడ భాగంలో చర్మం నల్లగా మారి ఎబ్బెట్టుగా కనిపిస్తోందా? ఈ సింపుల్ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!

ABN, Publish Date - Mar 28 , 2024 | 03:02 PM

మెడపై నల్లగా కనిపించడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. మెడ మీద నలుపును ఇంట్లోనే ఇలా వదిలించుకోవచ్చు.

మెడపై నల్లగా కనిపించడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. మెడపై చాలా సార్లు హైపర్‌పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది, కొన్నిసార్లు సూర్యకాంతి కారణంగా మెడ నల్లగా మారుతుంది. చాలామందిలో తరచుగా మురికి పేరుకుపోవడం వల్ల మెడపై నలుపు కనిపిస్తుంది. జుట్టు ఎప్పుడూ ఓపెన్ గా ఉండటం లేదా పొట్టిగా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో విపరీతమైన చెమట సమస్య ఉన్నవారు. మెడపై దుమ్ము, ధూళి పేరుకుపోయి ఇబ్బంది పడేవారిలో కూడా మెడ కూడా నల్లగా కనిపిస్తుంది. ఈ కింది సింపుల్ చిట్కాలతో మెడనలుపును ఈజీగా వదిలించుకోవచ్చు..

నిమ్మ, రోజ్ వాటర్..

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ మెడ చర్మంలో నలుపును పోగొడుతుంది. నిమ్మకాయలో స్కిన్ టానింగ్ తగ్గించే ఏజెంట్లు ఉంటాయి. నిమ్మరసం, రోజ్ వాటర్‌ను సమాన పరిమాణంలో తీసుకుని వాటిని బాగా మిక్స్ చేసి కాటన్ సహాయంతో ఈ మిశ్రమాన్ని మెడపై రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే మెడ మెరుస్తుంది. దీన్ని వారానికి 2 నుండి 3 సార్లు అప్లై చేయవచ్చు.

ఇది కూడా చదవండి: కింగ్ కోబ్రా vs రస్సెల్ వైపర్.. ఏది ఎక్కువ విషపూరితమంటే..


బంగాళాదుంప జ్యూస్..

బంగాళదుంపలు సహజమైన బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్‌ను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. బంగాళదుంప రసాన్ని నిమ్మరసంలో కలిపి చర్మానికి రాసుకోవచ్చు. ఒక గిన్నెలో బంగాళాదుంప రసం తీసి అందులో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి 20 నిమిషాలు ఉంచి తర్వాత కడిగేయాలి. కొన్ని రోజుల పాటూ దీన్ని ఉపయోగించిన తరువాత ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.

కాఫీ..

బ్రౌన్ కాఫీ మెడ నలుపును తగ్గిస్తుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు, చర్మానికి మేలు చేసే అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. కాఫీలో నీటిని కలిపి పేస్ట్‌ను సిద్ధం చేయాలి. దీన్ని మెడకు బాగా పట్టించి 10 నుంచి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ని వారానికోసారి వేసుకోవచ్చు.

అబ్ ట్యాన్ ప్యాక్..

ఇంట్లో తయారుచేసే అబ్ ట్యాన్ పేస్ట్ నల్లని మెడపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. పెరుగు, పసుపు, నిమ్మరసం, శెనగపిండి కలపాలి. ఈ పేస్ట్‌ను మెడపై అరగంట పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మెడలోని డార్క్ నెస్ తగ్గి చర్మపు ఆకృతి మెరుగుపడి చర్మం మృదువుగా మారుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 28 , 2024 | 03:02 PM

Advertising
Advertising