Positive Mindset in Children : పిల్లల్లో సానుకూల ఆలోచనను పెంచే తొమ్మిది చిట్కాలు..
ABN, Publish Date - Feb 20 , 2024 | 03:42 PM
తల్లిదండ్రులు పిల్లలు పెద్దవారయ్యే వరకూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం, నచ్చిన విషయాలను గురించి మాట్లాడటం, మంచి చెడులను గురించి వాళ్ళతో చర్చించేది కూడా తల్లిదండ్రులే కావాలి. జీవితంలో సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం అంటే పిల్లలు తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా ఉండాలి. ఎదురయ్యే చాలా సమస్యలను సానుకూలంగా చూడటం అలవర్చుకోవాలి. చిన్న ఎదురుదెబ్బ తగిలినా తట్టుకోనేలా తల్లిదండ్రులే ఈ స్థితి నుంచి బయటపడేయగలిగేది.
తల్లిదండ్రులు పిల్లలు పెద్దవారయ్యే వరకూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం, నచ్చిన విషయాలను గురించి మాట్లాడటం, మంచి చెడులను గురించి వాళ్ళతో చర్చించేది కూడా తల్లిదండ్రులే కావాలి. జీవితంలో సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం అంటే పిల్లలు తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా ఉండాలి. ఎదురయ్యే చాలా సమస్యలను సానుకూలంగా చూడటం అలవర్చుకోవాలి. చిన్న ఎదురుదెబ్బ తగిలినా తట్టుకోనేలా తల్లిదండ్రులే ఈ స్థితి నుంచి బయటపడేయగలిగేది. పిల్లలు చిన్న తనం నుంచి వారిలో దృఢమైన మార్పును తీసుకురావాల్సింది కూడా వారే.. బయటి వ్యక్తుల కంటే పేరెంట్స్ చెప్పేదే ఎక్కువగా పిల్లలు వింటారు. అందుకే వాళ్ళ రోల్ మోడల్స్ తల్లిదండ్రులే అవుతారు. పిల్లల్లో సానుకూల దృక్పథం ఏర్పరచాలంటే..
రోల్ మోడల్‌గా ఉండండి.
పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి చాలా నేర్చుకుంటారు. జీవితంలో సానుకూలంగా ఉంటే, పిల్లలు అదే వైఖరిని అభివృద్ధి చేస్తారు., కానీ పిల్లలు పెద్దల ప్రతి చర్యను, భావాలను, భావోద్వేగాలను గమనిస్తారు. నెమ్మదిగా, క్రమంగా పిల్లలు అనుకునే దాన్ని, నమ్మిన విషయాలనే అనుసరించడం ప్రారంభిస్తారు. ప్రతికూల పరిస్థితులలో సానుకూలంగా ఉండటం, అనుసరించే ప్రతిదీ సాధ్యమేనని, మంచిదని వారికి చూపించండి. ఇది వారికి సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: పిల్లలకి నచ్చే పోహా నెగ్గెట్స్ తయారీ ఎంత ఈజీనో.. !
పిల్లలను ప్రోత్సహించండి.
పిల్లలు నిరుత్సాహంగా ఉన్నప్పుడు జీవితంలోని సానుకూల విషయాలను చూడమని వారిని ప్రోత్సహించాలి. పిల్లలు ఏదైనా విజయం సాధించినప్పుడు పిల్లల్ని అభినందించాలి. వారు తప్పులు చేస్తే వారిని తిట్టవద్దు. బిడ్డ ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తిస్తే, తిట్టకూడదు. ఈ రకమైన ప్రవర్తన మంచిది కాదనే విషయాన్ని అతనికి చెప్పాలి. ఇలా చేయడం వల్ల సానుకూలత విధానంలో ఆలోచిస్తారు.
పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వండి.
పిల్లలలో క్రమశిక్షణను పాటించడం చాలా ముఖ్యం. దానితో పాటు పిల్లలకు స్వేచ్ఛను కూడా ఇవ్వాలి.
పిల్లలు స్నేహాలు..
స్నేహం పిల్లల్ని చాలా ప్రభావితం చేస్తుంది. అలాగే స్నేహితులు కూడా ప్రభావితం చేస్తాయి. బాధ, సంతోషం అనే విషయాలను స్నేహితులతో పంచుకునేందుకు చూస్తారు. పిల్లల్లో చలాకీతనం, చురుకుగా ఉండే తత్వంతో పాటు సానుకూల వ్యక్తులుగా మారేందుకు ఇది దోహదం చేస్తుంది.
Updated Date - Feb 20 , 2024 | 03:46 PM