ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayadashami: దసరా రోజు మోసపోకండి.. అవి నమ్మితే అంతే సంగతులు

ABN, Publish Date - Oct 12 , 2024 | 12:25 PM

సెంటిమెంట్‌గా పండుగ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే దసరా రోజు మోసపోయే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ముఖ్యంగా జనం ఆఫర్ల వైపు ఆకర్షితులవుతారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారస్తుులు..

Dussehra offers

పండుగ వచ్చిందంటే చాలు.. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. దసరా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం ఇంట్లో అమ్మవారి పూజ.. సాయంత్రం బయట రావణుడి దహనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పండుగ రోజు సరదాగా, ఉత్సాహంగా గడుపుతుంటారు. మరోవైపు పండుగ వచ్చిందంటే కొంతమంది దానిని ఆసరగా చేసుకుని మోసాలు చేసేవాళ్లుంటారు. సాధారణంగా పండుగకి ముందు రోజు కొన్ని వస్తువులు కొంటే.. సెంటిమెంట్‌గా పండుగ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే దసరా రోజు మోసపోయే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ముఖ్యంగా జనం ఆఫర్ల వైపు ఆకర్షితులవుతారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారస్తుులు తక్కువ నాణ్యత గల వస్తువులపై ఆఫర్లు పెట్టి అమ్మేస్తుంటారు. తీరా కొని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మోసపోయామని అర్థం చేసుకుంటారు. పండుగ ఆఫర్ల పేరుతో చాలా మంది రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. చేతికి పెట్టుకునే వాచీ మొదలు ఇంట్లో అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నింటిపై ఆఫర్లు ఉంటాయి. షాపు బయట తక్కువ రేటుకే పలాన వస్తువు అని బోర్డులు పెడతారు. తీరా లోపలికి వెళ్లిన తరువాత నాసిరకం వస్తువులపై తక్కువ ధర పెట్టి.. మిగతా వస్తువులపై ధర ఎక్కువుగానే ఉంటుంది. ఆఫర్ చూసి షాపులోపలికి వెళ్లి వస్తువుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. దీనిపై ఆఫర్ లేదంటూ దుకాణదారుడు చెబుతారు. ఇక కొన్న తర్వాత మళ్లీ వదిలేయడం ఎందుకనే సెంటిమెంట్‌తో ఆ వస్తువును కొంటారు. ఇలా పండుగల వేళ పెట్టే ఆఫర్లకు ఆకర్షితులై చాలామంది మోసపోతుంటారు.


స్పష్టత అవసరం..

ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు స్పష్టత అవసరం. ఏ వస్తువు కొనాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఎలాంటి ఫీచర్స్ ఉన్నది తీసుకోవాలనుకుంటున్నాం.. ఎంత ధరలో కొన్నాలనుకుంటున్నామో డిసైడ్ అవ్వాలి. మనం కొనాలనుకుంటున్న వస్తువుపై ఆఫర్ ఉంటే.. వెంటనే అందులో మనకు అవసరమైన అన్ని ఫీచర్స్ ఉన్నాయోలేదో చూసుకోవాలి. ఏ కంపెనీ అనేది చాలాముఖ్యం. కొన్నిసార్లు మనకు అవసరమైన ఫీచర్లు ఉండి, ధర అందుబాటులో ఉన్నా.. అవి నాసిరకమైన వస్తువులుల కావొచ్చు. అందుకే కొనడానికి ముందే అన్ని విషయాలు తెలుసుకోవాలి.


ఆఫర్ల విషయంలో..

బై వన్ గెట్ వన్ ఆఫర్లు దుస్తుల విషయంలో ఎక్కువుగా చూస్తుంటాం. ఇలాంటి ఆఫర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని తొందరపడితే కొనుగోలుచేసిన వారం రోజుల్లోనే అవి పాడయ్యే అవకాశాలు ఉంటాయి. తక్కువ ధరకు, ఆఫర్లలో కొనుగోలు చేసిన వస్తువుల నాణ్యత చాలా తక్కువుగా ఉంటుంది. కొంతమంది కొన్ని ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన పేర్లతో దుస్తులను ఆఫర్లలో విక్రయిస్తారు. అయితే ఆ బ్రాండ్‌ నేమ్‌లో ఏదైనా ఒక అక్షరం తేడా ఉండొచ్చు. చూడటానికి పేరు ఒకేలా ఉన్నా.. నాణ్యతలో చాలా తేడా ఉంటుంది. అందుకే వస్తువులు ఆఫర్లలో కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త.. పండుగ పేరుతో పెట్టే ఆఫర్లను చూసి మోసపోవద్దు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 12 , 2024 | 12:25 PM