ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Worlds Largest Bird: భూమి పై జీవిస్తున్న ఐదు అతి పెద్ద పక్షలు ఇవే.. !

ABN, Publish Date - Jan 19 , 2024 | 03:53 PM

భూమి మీద అత్యంత బరువైన పక్షి.. మగ పక్షులు 220 నుంచి 290 పౌండ్లకు చేరుకుంటాయి.

Worlds Largest Bird

ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు, వాటిలో పశుపక్షాదులకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెద్దగా భారీ ఆకారంతో ఉన్న జీవులంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. భూమి మీద ప్రస్తుతం జీవించే పక్షులన్నింటిలోకి అతి పెద్ద పక్షుల గురించి మీకు ఎంత వరకూ తెలుసు. ప్రస్తుతం కొన్ని రకాల పక్షులు అన్ని పక్షి జాతుల్లోకి అది పెద్దవిగా ఉన్నాయి. వీటి ఆకారమే కాదు, బరువులో కూడా అది భారీ పరిమాణం. ఇంకా ఇవి ఏ ప్రాంతాల్లో సంచరిస్తాయి అనేది తెలుసుకుందాం.

నిప్పుకోడి..

భూమి మీద అత్యంత బరువైన పక్షి.. మగ పక్షులు 220 నుంచి 290 పౌండ్లకు చేరుకుంటాయి. ఇవి ఆఫ్రికాకు చెందినవి, వేగంగా పరుగెత్తడానికి పేరు పొందిన పక్షులు ఇవి. చూసేందుకు భారీ ఆకారంతో కనిపించే ఈ పక్షులు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తగల పక్షులు. గాలిలో ఎగరలేనప్పటికీ జంప్ చేయడంలో దాదాపు 3 నుంచి 5 మీటర్లు దూరాన్ని కవర్ చేయగలదు. ఈ నిప్పుకోడి ప్రపంచంలోనే అతి వేగంగా పరుగెత్తే పక్షి. సగటున గంటకు 75 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు. ఇది పెట్టే గుడ్డు కూడా పెద్దగానే ఉంటుంది. ఈ గుడ్డు ఆరు అంగుళాల పొడవు 5 మిల్లీ మీటర్ల వెడల్పుతో ఉంటుంది. నిప్పుకోడి ఎగరలేదు కానీ దిశను మార్చుకునేందుకు తన రెక్కల్ని ఉపయోగిస్తుంది. అన్ని పక్షులకూ పాదాలకు నాలుగు, ఐదు వేళ్ళు ఉంటే దీనికి మాత్రం రెండే కాలి వేళ్లు ఉంటాయి. పెద్ద కళ్ళు కూడా ఉంటాయి.

ఈము..

ఆస్ట్రేలియా ఫ్లైట్ లెస్ జెయింట్, 6.2 అడుగుల ఎత్తులో, 120 పౌండ్ల బరువుతో విలక్షణంగా పొడవాటి కాళ్లు కలిగి ఉంటుంది. ఈము పక్షుల కొవ్వు నుంచి ఖరీదైన నూనెను తయారు చేస్తారు. ఇది కీళ్ళ నొప్పులకు, చర్మవ్యాధుల నివారణలో వాడతారు. బాగా ఎదిగిన పక్షులు, నున్నని నీలం రంగు మెడ, శరీరమంతటా రంగు రంగుల చుక్కలున్న ఈకలు కలిగి ఉంటాయి.

సదరన్ కాసోవరీ..

శక్తివంతమైన, పెద్ద పక్షులు ఇవి. ఆస్ట్రేలియన్ కాసోవరీ లేదా టూ వాటిల్ కాసోవరీ అని కూడా పిలుస్తారు. ఆస్ట్రేలియా, న్యూగినియాలలో కనిపించే అది పెద్ద ఎగిరే పభులు ఇవి. మరుగుజ్జు ఆకారంలో కనిపించినా, ఈ జాతి పొడవు 127 నుండి 170 సెం.మీ (4 అడుగుల 2 నుండి 5 అడుగుల 7 అంగుళాలు) వరకు ఉంటుంది. గరిష్ట పరిమాణం 85 kg వరకూ ఉంటుంది.

రియా..

దక్షిణ అమెరికాలో కనిపించే అతిపెద్ద పక్షి. ఈ పక్షలు వాటి పొడవైమ కాళ్ళకు ప్రసిద్ధి చెందాయి. ఇది మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఇవి ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తాయి. రియాస్ పెద్దవి, ఎగరలేని పక్షులు బూడిద, గోధుమ రంగు ఈకలు, పొడవాటి కాళ్లు, పొడవైన మెడ, ఉష్ట్రపక్షిలాగా ఉంటాయి. తల వద్ద 170 సె.మీ ఎత్తు, వెనుక భాగంలో 100 సెం.మీ, 40 కేజీల వరకు బరువు కలిగి ఉంటాయి. లోతట్టు ప్రాంతాలను ఇష్టపడతాయి, అరుదుగా 1,500 మీటర్లు (4,900 అడుగులు) పైకి ఎగురుతాయి.

ఇది కూడా చదవండి: ప్రకృతిలో నీలం ఎందుకు అరుదైన రంగో తెలుసా..!!


కోరి బస్టర్డ్..

ఆఫ్రికాలో అత్యంత బరువైన ఎగిరే పక్షి ఇది. ఇందులో మగవి బరువు 42 పౌండ్లు వరకూ ఉంటుంది. మగవారి కంటే ఆడ పక్షులు 2 నుంచి 3 రెట్లు తక్కువ బరువు కలిగి ఉంటాయి. నేలపై నివసించే పక్షికోరి బస్టర్డ్ నిగూఢమైన రంగులో ఉంటుంది, ఎక్కువగా బూడిదరంగు, గోధుమ రంగులో ఉంటుంది. నలుపు, తెలుపు రంగులతో చక్కగా నమూనా చేయబడింది. ఎగువ భాగాలు, మెడ వర్మిక్యులేటెడ్ నలుపు, బూడిద-బఫ్ రంగులో ఉంటాయి. సాధారణంగా 7, 18 కిలోల బరువు ఉంటాయి.

ఆండియన్ కాండోర్..

న్యూ వరల్డ్ రాబందులను సాధారణంగా ఈ క్రమానికి చెందినవిగా పరిగణిస్తారు, అయితే వాటి చేరికను అందరూ అంగీకరించరు.శరీర బరువు, రెక్కల విస్తీర్ణం ఆధారంగా ఈ క్రమంలో అతిపెద్ద జాతులు పశ్చిమ దక్షిణ అమెరికాకు చెందిన ఆండియన్ కండోర్. ఇవి 3.2 మీ (10 అడుగులు)రెక్కలు, 15 కిలోల (33 పౌండ్లు) బరువును చేరుకోగలదు.

గోల్డెన్ ఈగల్..

( అక్విలా క్రిసాటోస్ ) వీటి రెక్కల విస్తీర్ణం చాలా పెద్దది, ముదురు రంగులో ఉంటుంది. ఇది ఎరను 50 మీటర్ల ఎత్తు నుంచే వేటాడగలదు.

Updated Date - Jan 19 , 2024 | 03:53 PM

Advertising
Advertising