Optical Illusion: ఈ ఫ్లెమ్మింగోల మధ్య ఉన్న హార్ట్ సింబల్‌ను కనిపెడితే మీ కళ్లకు తిరుగులేదు..!
ABN, Publish Date - Jul 02 , 2024 | 09:19 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో చాలా ఫ్లెమ్మింగో పక్షులు ఉన్నాయి. పదుల సంఖ్యలో ఉన్న ఆ ఫ్లెమ్మింగోలు ఒకదానితో ఒకటి కలిసి పోయి ఉన్నాయి. ఆ పక్షుల మధ్య ఓ హార్ట్ సింబల్ కూడా ఉంది. ఆ హార్ట్ సింబల్ ఎక్కుడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 12 సెకెన్ల వ్యవధిలో ఆ హార్ట్ సింబల్‌ను కనిపెట్టగలాగాలి. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. హార్ట్ సింబల్ ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: అధిక తెలివితేటలంటే ఇవే.. ఈ ఫ్యాన్‌ను ఆపాలంటే కరెంట్ పోవాల్సిందే..షాకవుతున్న నెటిజన్లు!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 02 , 2024 | 12:32 PM