Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో తెలుసుకోండి.. ఈ కుక్కల మధ్యలో పిల్లి ఎక్కడుందో 13 సెకెన్లలో కనిపెట్టండి..
ABN, Publish Date - Mar 20 , 2024 | 05:11 PM
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి.
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది (Brain Test).
ఆ ఫొటోలో పిల్లి ఎక్కడుందో కనిపెట్టడానికి మీ బ్రెయిన్‌ను సిద్ధం చేసుకోండి. వైరల్ అవుతున్న ఆ ఫొటోలో బోలెడన్ని కుక్కలున్నాయి. ఆ కుక్కలన్నీ రకరకాల ఆకారాల్లో ఉన్నాయి. ఆ కుక్కల మధ్యలో ఓ పిల్లి కూడా ఉంది. ఆ పిల్లిని 13 సెకెన్లలో పట్టుకోగలరేమో ప్రయత్నించండి. ఫొటోను జూమ్ చేయకుండా ప్రయత్నించండి. ఆ పిల్లిని కనిపెట్టగలిగారా? అయితే మీకు కంగ్రాట్స్.. కనిపెట్టలేని వారు కింది ఫొటో చూడండి. పిల్లి ఎక్కడ దాక్కుందో తెలిసిపోతుంది.
Updated Date - Mar 20 , 2024 | 05:11 PM