ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్నారుల కోసం...

ABN, Publish Date - Oct 20 , 2024 | 09:11 AM

పిల్లల అవసరాలు తీర్చడానికి, వారికి సంబంధించిన పనిని మరింత సులభతరం చేసేందుకు చాలా గ్యాడ్జెట్స్‌ ఉన్నాయి. వేళ్లు నొప్పి పెట్టకుండా పెన్సిల్‌ గ్రిప్పర్‌, ఏటీఎం లాంటి పిగ్గీబ్యాంక్‌... ఇలాంటి కొన్ని స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ ఇవి...

పిల్లల అవసరాలు తీర్చడానికి, వారికి సంబంధించిన పనిని మరింత సులభతరం చేసేందుకు చాలా గ్యాడ్జెట్స్‌ ఉన్నాయి. వేళ్లు నొప్పి పెట్టకుండా పెన్సిల్‌ గ్రిప్పర్‌, ఏటీఎం లాంటి పిగ్గీబ్యాంక్‌... ఇలాంటి కొన్ని స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ ఇవి...

ప్రయాణాల్లో ...

ప్రయాణ సమయంలో మరీ చిన్న పిల్లలకైతే డైపర్లు వేస్తారు.

కాస్త పెద్ద పిల్లల సంగతేంటి? వారికి టాయిలెట్‌ వస్తే... ‘పాటీ బాటిల్స్‌’ అందుబాటులోకి వచ్చాయి. వాటర్‌ బాటిల్‌ మాదిరిగా ఉండే వీటిని ప్రయాణ సమయంలో సులువుగా ఉపయోగించి, మూత పెట్టొచ్చు. ఆ తర్వాత టాయిలెట్‌లో పారబోసి, వేడి నీళ్లతో బాటిల్‌ను శుభ్రం చేయొచ్చు. కేవలం అబ్బాయిల కోసమే కాదు, అమ్మాయిల కోసం కూడా విడిగా మూతలున్న బాటిళ్లున్నాయి.


పిల్లలు తప్పిపోకుండా...

మాల్స్‌, సూపర్‌ మార్కెట్‌, ఎయిర్‌పోర్ట్‌ లాంటి రద్దీ ప్రదేశాల్లో పిల్లలు తప్పిపోకుండా ‘చైల్డ్‌ సేఫ్టీ రోప్‌’ పనికొస్తుంది. దీనికి ఇరువైపుల ఉన్న బ్యాండ్‌లలో ఒకటి పిల్లలకు, మరొకటి పెద్దవాళ్ల మణికట్టుకు తగిలించాలి. లాక్‌ సిస్టమ్‌తో ఉంటుంది కాబట్టి పిల్లలు విడిపించుకొంటారనే భయం అక్కర్లేదు. రెండు మీటర్ల వరకు సాగుతుంది. వివిధ రంగుల్లో అందుబాటులో ఉంది.

త్రీ ఇన్‌ వన్‌

ఏకకాలంలో మూడు పనులు చేసేదే ఈ ‘త్రీ ఇన్‌ వన్‌ ఎల్‌ఈడీ లైట్‌’. చిన్నారులు రాత్రిపూట చదువుకునేందుకు నైట్‌ ల్యాంప్‌గా, షార్ప్‌నర్‌గా, పెన్‌ హోల్డర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఎల్‌ఈడీ లైట్‌ నుంచి వచ్చే కాంతి పిల్లల కంటికి ఎలాంటి హాని కలిగించకుండా పూర్తి రక్షణనిస్తుంది. దీని ముందు భాగంలో ఉన్నదే షార్ప్‌నర్‌. ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది.


గ్రిప్‌ కోసం...

అప్పుడప్పుడే రాయడం నేర్చుకుంటున్న పిల్లలకు పెన్సిల్‌ లేదా పెన్ను ఎలా పట్టుకోవాలో తెలీదు. ‘పెన్సిల్‌ గ్రిప్‌’ మధ్యలో ఉన్న రంధ్రంలో పెన్సిల్‌ పెట్టి... దానికి ఇరువైపులా బొటనవేలు, చూపుడు వేలును ఉంచి, మిగిలిన వేళ్లను కింద వైపునకు తగిన విధంగా ఉంచితే గ్రిప్‌ దొరుకుతుంది. మృదువైన సిలికాన్‌ మెటీరియల్‌తో తయారుచేసిన పెన్సిల్‌ గ్రిప్‌ 2-4 సంవత్సరాల లోపు పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది.


మినీ ఏటీఎం

ఇంతకుముందు పిల్లలు డబ్బులు దాచుకోవడానికి ‘పిగ్గీ బ్యాంక్‌’ ఉండేది. వాటిలో ఎంత డబ్బు పోగయ్యిందో తెలిసేది కాదు... పగలగొడితే తప్ప. అయితే ఈ తరానికి తగ్గట్టుగా ‘డిజిటల్‌ కాయిన్‌ కౌంటింగ్‌ పిగ్గీ బ్యాంక్‌’ వచ్చేసింది. ఇది ఏటీఎంను పోలి ఉంటుంది. దీని ముందు భాగంలో డిజిటల్‌ మీటర్‌ ఉంటుంది. ఏటీఎం కార్డును ఇందులో పెట్టి.. నోట్లు లేదా కాయిన్స్‌గానీ వేసుకోవచ్చు. డబ్బులు వేసిన ప్రతీసారీ బ్యాలెన్స్‌ ఎంత ఉందో డిజిటల్‌ మీటర్‌పై కనిపిస్తుంది. వాయిస్‌ రూపంలో వినిపిస్తుంది కూడా. డబ్బులు కావాలంటే ఏటీఎం ముందు భాగంలో ఉన్న డోర్‌ తెరిచి తీసుకోవచ్చు. ఇది బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది.

Updated Date - Oct 20 , 2024 | 09:11 AM