ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సరిహద్దు దేశభక్తి

ABN, Publish Date - Aug 18 , 2024 | 09:30 AM

పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ అనగానే ఎవరికైనా ముందుగా స్వర్ణదేవాలయం గుర్తుకొస్తుంది. అయితే అక్కడే భారత- పాకిస్తాన్‌ సరిహద్దుగా ఉన్న ‘అటారీ- వాఘా’ ప్రాంతంలో జరిగే సైనిక విన్యాసాలు అందరూ చూసి తీరాల్సిందే.

పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ అనగానే ఎవరికైనా ముందుగా స్వర్ణదేవాలయం గుర్తుకొస్తుంది. అయితే అక్కడే భారత- పాకిస్తాన్‌ సరిహద్దుగా ఉన్న ‘అటారీ- వాఘా’ ప్రాంతంలో జరిగే సైనిక విన్యాసాలు అందరూ చూసి తీరాల్సిందే.

‘అటారీ’ గ్రామం భారత్‌ (పంజాబ్‌) సరిహద్దు అయితే, పాకిస్తాన్‌ (కరాచీ) సరిహద్దు గ్రామం ‘వాఘా’. దేశ విభజన సమయంలో రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాన్ని గుర్తిస్తూ ఏర్పాటు చేసిన ‘రాడ్‌ క్లిఫ్‌’ లైన్‌ ఉన్న ప్రదేశమే వాఘా బోర్డర్‌గా పేరొందింది. ఈ సరిహద్దులోని మన ప్రాంతంలో మన దేశ సైనికులు జరిపే ‘బీటింగ్‌ రిట్రీట్‌ సెరమనీ’ సైనిక విన్యాసాలు, కవాతులు కనువిందు చేస్తాయి. అక్కడ విన్యాసాలతో పాటు చేసే నినాదాలు చూపరుల ఒళ్ళు పులకరించేలా ఉంటాయి. వాటిని చూడడానికి వచ్చిన ప్రేక్షకులు కార్యక్రమంలో లీనమై దేశభక్తితో ఊగిపోతారు. దాంతో ఆ ప్రాంతమంతా పూనకం వచ్చినట్లుగా హోరెత్తిపోతుంది.


ప్రవేశం ఉచితం

‘అటారీ- వాఘా’లో వీటిని వీక్షించడానికి ఒక స్టేడియం వంటి కట్టడం ఉంటుంది. ఇక్కడికి ప్రవేశం ఉచితమే! ప్రతిరోజూ సాయంత్రం ఈ కవాతు జరుగుతుంటుంది. సరిహద్దులో గల ఒక గేట్‌ వద్ద మన దేశ మువ్వన్నెల పతాకం ఉంటుంది. విన్యాసాల్లో భాగంగా మొదట మనదేశ సైనికులు పతాకాన్ని ఎగురవేస్తారు. చివర్లో పతాక వందనం చేస్తారు. మధ్యలో ఒకసారి పాకిస్తాన్‌ సైనికులతో కూడా చేతులు కలుపుతారు. ఎదురుగా ఉండే పాక్‌ భూభాగంలో వారి సైనికులు కూడా విన్యాసాలు చేస్తారు. అయితే మన కవాతే ఉత్సాహభరితంగా, ఉత్తేజంగా జరుగుతుంటుంది. ఈ ప్రాంతంలో దేశభక్తిని ప్రేరేపించే టీ షర్ట్స్‌, పతాకాలు, దేశ చిత్రపటాలతో పాటు ఇతరత్రా వస్తుసామాగ్రిని స్టాల్స్‌లో అమ్ముతుంటారు. ఇవి చవకగా లభిస్తాయి. కవాతు పూర్తయిన తర్వాత అక్కడి సైనికులతో కలిసి ఎంచక్కా ఫొటోలు దిగొచ్చు. పర్యాటకులకు నిజంగానే ఇదొక సరికొత్త, మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది.

- రఘువీర్‌ కాచం

.................................................


ఎలా చేరుకోవాలి?

- అమృత్‌సర్‌కు విమానంలోగానీ, రైలులోగానీ వెళ్లొచ్చు.

- అమృత్‌సర్‌ నుంచి క్యాబ్‌లో ఉదయమే స్వర్ణ దేవాలయం దర్శించుకొని, సాయంత్రం అటారీ-వాఘా బోర్డర్‌కు (సుమారు 27 కిలోమీటర్లు) చేరుకోవచ్చు.

Updated Date - Aug 18 , 2024 | 09:30 AM

Advertising
Advertising
<