Shocking: మీ కళ్లను మీరే నమ్మలేరు.. చెట్టు నుంచి బయటకు వచ్చిన దెయ్యం కాలి వేళ్లు.. అసలు నిజమేంటంటే..
ABN, Publish Date - Apr 29 , 2024 | 01:11 PM
మీరు అలా అడవిలో లేదా పొలాల మధ్య తిరుగుతున్నప్పుడు చెట్లను చూసి ఎప్పుడైనా భయపడ్డారా? చెట్ల మధ్య నుంచి దెయ్యం కాలి వేళ్ల లాంటి ఆకారాలను చూశారా? ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోందా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోను చూసిన వారికి కూడా అదే ఫీలింగ్ కలుగుతోంది.
మీరు అలా అడవిలో (Forest) లేదా పొలాల మధ్య తిరుగుతున్నప్పుడు చెట్లను చూసి ఎప్పుడైనా భయపడ్డారా? చెట్ల మధ్య నుంచి దెయ్యం కాలి వేళ్ల (Ghost Feet) లాంటి ఆకారాలను చూశారా? ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోందా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోను చూసిన వారికి కూడా అదే ఫీలింగ్ కలుగుతోంది. ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ (IFS Praveen Kaswan) ఈ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు (Viral News).
ప్రవీణ్ కశ్వాన్ షేర్ చేసిన ఈ ఫొటోలో ఓ చెట్టు కాండం కనిపిస్తోంది. ఆ కాండం క్రింద నుంచి కాలి వేళ్ళు బయటకు వచ్చాయి. నీలం రంగులో ఉన్న కాలి వేళ్లను చూస్తే ఎవరో చనిపోయిన మనిషివో, లేదా దెయ్యానివో అని కచ్చితంగా అనిపించి భయం వేస్తుంది. ఈ ఫొటో పోస్ట్ చేసిన ప్రవీణ్ కశ్వాన్.. ``అడవిలో ఇలాంటివి చూస్తే ఎలా ఉంటుంది`` అని ప్రశ్నించారు. ఈ ఫొటోపై నెటిజన్లు తమ స్పందనలు తెలియజేశారు. అది దెయ్యం పాదం అంటూ చాలా మంది కామెంట్లు చేశారు.
తర్వాత మరో ట్వీట్ చేసిన ప్రవీణ్ కశ్వాన్ ఆ ఫొటో అసలు సీక్రెట్ బయటపెట్టారు. అది దెయ్యం పాదం కాదని స్పష్టం చేశారు. అది భయంకరమైన జిలేరియా పాలిమార్ఫా (Xylaria Polymorpha) అనే ఫంగస్ అని తెలిపారు. దీనిని సాధారణ పరిభాషలో ``డెడ్ మేన్స్ ఫింగర్స్`` (Dead man's fingers) అంటారు. సాప్రోబిక్ ఫంగస్ అయిన ఈ జిలేరియా పాలిమార్ఫా అనేది చెట్ల కాండాలలో, కుళ్లిపోయిన చెక్కలో పెరుగుతుంది. ఈ ఫంగస్ పూర్తిగా మానవ కాలి వేళ్లను పోలి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఓర్నీ.. మెడలో దండ ఎవరైనా ఇలా వేస్తారా? వధువు మీదకు దూకిన వరుడు.. ఫన్నీ వీడియో వైరల్!
Viral Video: ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. లారీ టైర్లు జంటగా ఎలా వెళ్లిపోయాయో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 29 , 2024 | 01:11 PM