Indian Whisky: ఇండియన్ విస్కీతో కిక్కే వేరబ్బా.. మన సింగిల్ మాల్ట్ విస్కీకి ఫారినర్లు ఫిదా!
ABN, Publish Date - Apr 19 , 2024 | 11:15 AM
ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే ఫారిన్ లిక్కర్ బాటిల్ తీసుకురమ్మని అడిగే వారు చాలా మంది ఉంటారు. అయితే అదంతా గతం. ప్రస్తుతం మన దేశంలో తయారయ్యే విస్కీ అంటే ఫారినర్లు ఎంతో ఇష్టపడుతున్నారు. ఇప్పటికే మన దేశానికి చెందిన పలు రకాల బ్రాండ్లు ఫారినర్ల మనసులను దోచుకున్నాయి.
ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే ఫారిన్ లిక్కర్ బాటిల్ తీసుకురమ్మని అడిగే వారు చాలా మంది ఉంటారు. అయితే అదంతా గతం. ప్రస్తుతం మన దేశంలో తయారయ్యే విస్కీ అంటే ఫారినర్లు ఎంతో ఇష్టపడుతున్నారు. ఇప్పటికే మన దేశానికి చెందిన పలు రకాల బ్రాండ్లు ఫారినర్ల మనసులను దోచుకున్నాయి. తాజాగా ``గోదావాన్ సెంచురీ`` (Godawan Century) సింగిల్ మాల్ట్ విస్కీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2024 లండన్ స్పిరిట్ కాంపిటీషన్‌లో (London Spirits Competition) అగ్రస్థానంలో నిలిచింది.
క్వాలిటీ, విలువ, ప్యాకేజింగ్ మొదలైన విషయాల్లో 100కు 96 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే సింగిల్ మాల్ట్ విస్కీల్లో రారాజుగా నిలిచింది. వినియోగదారుని దృష్టిలో ఉంచుకుని, నాణ్యత, విలువ, ప్యాకేజింగ్ అనే మూడు కీలక ప్రమాణాలపై లండన్ స్పిరిట్స్ కాంపిటీషన్‌లో దృష్టి సారిస్తారు. ఈ మూడు అంశాలలో మెరుగైన వాటినే ఎంట్రీ కల్పిస్తారు. అనంతరం వాటి నాణ్యతను పరిశీలిస్తారు. ప్రముఖ ఆల్కహాల్ బ్రాండ్ ``డియాజియో ఇండియా`` రూపొందించే గోదావాన్ సింగిల్ మాల్ట్ విస్కీ రాజస్థానీ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
తక్కువ నీటితో ఆరు వరుసల బార్లీని కలిపి 100 డిగ్రీల ఫారిన్ హీట్‌లో వేడి చేయడం వల్ల అపురూపమైన రుచి, గొప్ప సంక్లిష్టత వస్తుందని డియాజియో తెలిపింది. గ్లోబల్ లీడర్ అయిన డియాజియోకు అనుబంధ సంస్థ అయిన డియాజియో ఇండియా ఈ గోదావన్ విస్కీని తయారు చేస్తుంది. జానీ వాకర్, బ్లాక్ డాగ్, వ్యాట్ 69, యాంటిక్విటీ, సిగ్నేచర్, రాయల్ ఛాలెంజ్, మెక్‌డోవల్స్ వంటి ప్రముఖ బ్రాండ్లను కూడా డియాజియో తయారు చేస్తుంటుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ ట్రిక్ ఏదో బాగుందే.. గిన్నెలను కడిగేందుకు నీరు లేక ఓ వ్యక్తి ఎలా తింటున్నాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 19 , 2024 | 11:15 AM