Good Friend: మీరు నిజంగానే మంచి స్నేహితులుగా ఉంటున్నారా? ఈ 5 విషయాలతో తెల్చుకోండి!
ABN, Publish Date - Feb 26 , 2024 | 04:50 PM
స్నేహితులు ఉండటం సంగతి పక్కన పెడితే అసలు ఇతరులతో మీరు స్నేహంగా ఉంటున్నారా? అందులో నిజమెంత?
ప్రతి మనిషి జీవితంలో స్నేహం ప్రాధాన్యత చాలా గొప్పది. వందమంది పరిచయస్తుల కంటే.. ఓ మంచి స్నేహితుడు ఉండటం గొప్ప. చిన్నతనంలో స్కూల్లో మొదలు మనిషి జీవిత ప్రయాణంలో వివిధ దశలలో బోలెడు మంది పరిచయం అవుతారు. అయితే వీరిలో కొందరు మాత్రమే స్నేహితులుగా మిగులుతారు. ఈ స్నేహితులలో కూడా ఒకరో ఇద్దరో చాలా ప్రత్యేకం అవుతారు. స్నేహితులు ఉండటం సంగతి పక్కన పెడితే అసలు ఇతరులతో మీరు స్నేహంగా ఉంటున్నారా? అందులో నిజమెంత? మీరు నిజమైన స్నేహితులా కాదా... ఈ 5 విషయాలతో తేల్చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే..
ప్లానింగ్స్..
స్నేహితులతో కలసి ఏవైనా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సాధారణంగా అందరూ కలవడం సహజం. అయితే ఇలాంటివి ప్లానింగ్ చేసినా, అప్పటికే చేసుకున్న ప్లానింగ్ లు మీ ప్రమేయం లేకుండానే స్నేహితులు రద్దు చేస్తున్నా వారితో మీ స్నేహం అంత ఆశాజనకంగా లేదని, మీరు వారికి తగినంత సహకారం అందించలేరని అర్థం.
ఇది కూడా చదవండి: పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులివీ..!
ఊహించుకోవడం..
స్నేహితుల గురించి అ విధమైన విషయాలు పూర్తీగా తెలుసుకోకుండానే, వారి పరిస్థితి అర్థం చేసుకోకుండానే వారి గురించి రకరకాలుగా ఊహించుకునే అలవాటు ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మంచి స్నేహితులు కారని అర్థం.
అవసరం..
స్నేహితులు అంటే అవసరంలో ఆదుకునేవారు అని అంటుంటారు. అయితే కేవలం అవసరం అయినప్పుడు మాత్రమే స్నేహితులను పలకరిస్తూ, వారిని సహాయం అడుగుతుంటే.. మీది ఖచ్చితంగా అవసరం కోసం చేస్తున్న స్నేహమే అవుతుంది. ఇది స్వార్థపూరిత స్నేహం.
అర్థం చేసుకోకపోవడం..
సాధారణంగా బాధ, కోపం, భావోద్వేగాలు మొదలైనవి స్నేహితుల ముందు బయట పెట్టడం సహజం. అయితే స్నేహితులు మీ మాటలను వినే పరిస్థితిలో ఉన్నారా లేదా వారి మానసిక స్థాయి ఏంటి అనేవి పట్టించుకోకుండా కేవలం తమ ఎమోషన్స్ ను స్నేహితుల ముందు బయట పెడుతుంటే మీరు స్నేహితుల గురించి ఆలోచన లేనివారు.
తప్పులు..
తప్పులు అందరూ చేస్తారు. స్నేహితుల మధ్య కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అయితే తప్పు చేసి స్నేహితులను బాధపెట్టినప్పుడు స్నేహితులకు జవాబుదారీ తనంగా ఉండటం, తప్పు ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో చెప్పడం ముఖ్యం. అలా చెప్పకపోతే స్నేహితులకు, స్నేహానికి విలువ ఇవ్వనట్టే.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 26 , 2024 | 04:50 PM