ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Internet Calls: ఈ నంబర్ల నుంచి మీకు కాల్స్ వస్తున్నాయా.. తస్మాత్ జాగ్రత్త

ABN, Publish Date - Oct 22 , 2024 | 08:53 PM

సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో అమాయక జనాలను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ మధ్యన కొన్ని కొత్త నంబర్ల నుంచి వస్తున్న కాల్స్‌ను గుర్తించడం కష్టంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ టెలికం అథారిటీ అప్రమత్తత ప్రకటించింది.

Fake Calls

సైబర్ నేరాలు పెరిగిపోతున్న వేళ ఫేక్ కాల్స్, మెసేజుల నియంత్రణకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అక్టోబర్ 1 నుంచి నూతన పాలసీని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. స్పామ్ కాల్స్, మెసేజ్‌లను తగ్గించడమే ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానంలో కంపెనీలు తమ నెట్‌వర్క్ స్థాయిలోనే ఫేక్ కాల్స్ లేదా మెసేజులను బ్లాక్ చేస్తాయి. ఈ విధానానికి తోడు మోసాలకు చెక్ పెట్టేందుకు కృత్రిమ మేధస్సుతో పాటు అధునాతన సాంకేతికతను కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. అయినప్పటికీ కేటుగాళ్లు నిత్యం ఏదో ఒక కొత్త మార్గంలో అమాయకులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఇందుకోసం కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.


ఈ నంబర్ల నుంచి కాల్స్ వస్తే పట్టించుకోవద్దు..

+697 లేదా +698 ప్రారంభమైన నంబర్ల నుంచి తరచుగా ఇంటర్నెట్ కాల్స్ వస్తున్నాయని, ఈ కాల్స్‌ను గుర్తించడం కష్టంగా మారిందని థాయ్‌లాండ్ టెలికం అథారిటీ హెచ్చరించింది. కాల్స్‌ను గుర్తించడం కష్టంగా మారడంతో మోసగాళ్లు ఈ నంబర్లను ఉపయోగిస్తున్నారని తెలిపింది. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (VPN) ఉపయోగించి లోకేషన్‌ను మార్చివేస్తున్నారని, వాటిని ట్రాక్ చేయడం మరింత సవాలుగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. +697 లేదా +698తో ప్రారంభమైన నంబర్లతో కాల్స్ వస్తే వాటిని పట్టించుకోకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ కాల్స్ సాధారణంగా స్కామ్‌లు, మార్కెటింగ్ మోసాలతో ముడిపడి ఉంటాయని హెచ్చరించారు. ఈ నంబర్లతో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు.


ఒకవేళ పొరపాటున ఈ నంబర్ల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇచ్చినా వ్యక్తిగత సమాచారాన్ని మాత్రం షేర్ చేయవద్దని నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు లేదా ఇతర నమ్మదగిన సంస్థల నుంచి చేస్తున్నట్టు నమ్మిస్తారు. ‘‘వ్యక్తిగత సమాచారం అడిగితే తర్వాత కాల్ చేసి చెబుతానని అనండి. అందుకు వారు నిరాకరిస్తే అది స్కామ్‌కు సంకేతంగా భావించాలి’’ అని నిపుణులు సూచిస్తున్నారు.


ఫిర్యాదులు చేయవచ్చు

కేంద్ర ప్రభుత్వం సంచార్ సాతి వెబ్‌సైట్‌లో చక్షు (Chakshu) పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో నకిలీ కాల్స్, మెసేజులపై ఫిర్యాదు చేయవచ్చు. పోర్టల్‌లో కనిపించే సాధారణ సూచనలను అనుసరించి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇదిలావుంచితే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పీసీలు (పర్సనల్ కంప్యూటర్ల) దిగుమతులపై జనవరి నుంచి ఆంక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దేశీయంగా ఉత్పాదక సామర్థ్యాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఈ మేరకు అడుగులు వేస్తోంది.


ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్లపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు.. జరిగిన తప్పు ఇదే

సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ఏఐ వినియోగంలో జర జాగ్రత్త

For more Sports News and Business News and Telugu News

Updated Date - Oct 22 , 2024 | 08:56 PM