Viral News: డ్రైనేజీలో పడిన డైమండ్ రింగ్.. ఇంటి యజమాని ఏం చేశాడంటే..!
ABN, Publish Date - Jan 23 , 2024 | 06:45 PM
Viral News: మరికొద్ది రోజుల్లో కొడుకు పెళ్లి.. తన ఇంటికి వచ్చే కోడలికి అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ఆ మామ. ఇంకేముంది నేరుగా జ్యూవెలరీ షాప్‌కి వెళ్లి కోట్ల విలువ జేసే ఖరీదైన డైమండ్ రింగ్ చూశాడు. బాగా నచ్చింది. దానిని నేచురల్ లైట్‌లో ఫోటో తీసుకోవడానికి కిటికీ వద్దకు తీసుకెళ్లగా.. అదికాస్తా జారి పడిపోయింది. కింద పడితే ప్రాబ్లమ్ లేదు.. కానీ, అది తొమ్మిది అంతస్థుల నుంచి జారి డ్రైనేజీలో పడిపోయింది. దీంతో..
బీజింగ్, జనవరి 23: మరికొద్ది రోజుల్లో కొడుకు పెళ్లి.. తన ఇంటికి వచ్చే కోడలికి అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ఆ మామ. ఇంకేముంది నేరుగా జ్యూవెలరీ షాప్‌కి వెళ్లి కోట్ల విలువ జేసే ఖరీదైన డైమండ్ రింగ్ చూశాడు. బాగా నచ్చింది. దానిని నేచురల్ లైట్‌లో ఫోటో తీసుకోవడానికి కిటికీ వద్దకు తీసుకెళ్లగా.. అదికాస్తా జారి పడిపోయింది. కింద పడితే ప్రాబ్లమ్ లేదు.. కానీ, అది తొమ్మిది అంతస్థుల నుంచి జారి డ్రైనేజీలో పడిపోయింది. దీంతో దానిని కనిపెట్టేందుకు ప్రత్యేకంగా కూలీలను పెట్టాల్సి వచ్చింది. ఆ కూలీలు పోయిన డైమండ్‌ను కనిపెట్టేందుకు దాదాపు మూడు రోజులు శ్రమించారు. మరి పోయిన డైమండ్ రింగ్ దొరికిందా? అసలు ఇంతకీ ఏమైంది? ఇంట్రస్టింగ్ సమాచారం మీకోసం..
వివరాల్లోకెళితే.. ఆగ్నేయ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన వ్యక్తి కొడుక్కి వివాహం నిశ్చయమైంది. తన కొడుకు పెళ్లిని ఘనంగా నిర్వహిస్తున్న ఆ వ్యక్తి.. తన ఇంటికి వచ్చే కోడలికి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అప్పటికే ఇచ్చిన ఆర్డర్ మేరకు.. జ్యువెలరీ షోరూమ్‌కి వెళ్లి ఖరీదైన డైమండ్ రింగ్ తీసుకున్నాడు. దీని ధర చైనాలో ఒక మిలియన్ యువాన్లు కాగా, ఇండియన్ కరెన్సీలో రూ. 1,16,38,711(కోటీ పదహారు లక్షలు) ఉంటుంది. అయితే, కిటికీ ద్వారా సహజ కాంతిలో ఈ డైమండ్ రింగ్‌ను ఫోటో తీద్దామని ప్రయత్నించాడు ఆ వ్యక్తి. కానీ, రింగ్ చేతిలోంచి జారి పడిపోయింది. తొమ్మిది అంతస్థుల దిగువన ఉన్న డ్రైనేజీ గుంటలో పడిపోయింది. దాంతో ఉరుకులు పరుగులు మీద షాప్ సిబ్బంది, రింగ్ కొనుగోలు చేసిన వ్యక్తి కిందకు వెళ్లారు. దానిని వెతికేందుకు ప్రయత్నించారు. చివరకు కూలీ మనుషులను పెట్టి డైమండ్ రింగ్ కోసం వెతికించారు. ఒక్కొక్కరికి 500 యువాన్లు(రూ.5,846) చొప్పున చెల్లించారు. ఈ కూలీలు డైమండ్ రింగ్‌ను కనిపెట్టేందుకు దాదాపు మూడు రోజులు పట్టింది. చివరకు ఆ రింగ్ దొరకగా.. ఫుల్ ఖుషీ అయిపోయాడు దానిని కొనుగోలు చేసిన వ్యక్తి. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
అంత స్పెషల్ ఎందుకంటే..
వాస్తవానికి ఈ డైమండ్ రింగ్‌ను ప్రత్యేకంగా చేయించారట. అందుకే.. ఆ రింగ్‌ను ఆయన అంత ఆపురూపంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రింగ్ డబ్బు కంటే ఎక్కువ అని, పోయిన రింగ్ మళ్లీ దొరకడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు కస్టమర్. ఈ రింగ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. చైనీయులు ఎంతో పవిత్రంగా, దైవ సమానంగా భావించే గ్రీన్ జాడెట్‌ను ఈ రింగ్‌లో పొందుపరిచారట. ఈ రకం స్టోన్‌ను చైనాలో నియోలిథిక్ కాలం నుంచే ఆభరణాలలో వినియోగించేవారట. పురాతన కాలంలో ప్రజలు ఈ స్టోన్‌ను దేవతను సూచించే పవిత్ర చిహ్నంగా భావించేవారట. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. కాగా, ఇక్కడ మరో అదృష్టం ఏంటంటే.. రింగ్ పడిపోయిన డ్రైనేజీ.. వినియోగం లేదు. ఇందులో నీటి ప్రవాహం లేదు. దీనికి మరమ్మతులు చేయాల్సి ఉందని.. నిరుపయోగంగా ఉంచారట. ఈ కారణంగానే డ్రైనేజ్‌లో పడిపోయిన డైమండ్ రింగ్ కాస్త కష్టంగానైనా దొరికిపోయింది.
Updated Date - Jan 23 , 2024 | 06:45 PM