Expensive Sweet: ఈ స్వీట్ కొనాలంటే మీ ఆస్తులమ్మాల్సిందే..
ABN, Publish Date - Oct 30 , 2024 | 07:13 PM
దేశంలో అత్యంత ఖరీదైన స్వీట్ గురించి మీకు తెలుసా. దాన్ని కొనాలంటే మీ ఆస్తులు అమ్మాల్సిందే. ఇంతకు ఆ స్వీట్ ప్రత్యేకతేంటి. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో అత్యంత ఖరీదైన స్వీట్ గురించి మీకు తెలుసా. దాన్ని కొనాలంటే మీ ఆస్తులు అమ్మాల్సిందే. ఇంతకు ఆ స్వీట్ ప్రత్యేకతేంటి. ఆ వివరాలు తెలుసుకుందాం. దీపావళిని జీవితాల్లో వెలుగులు నింపే పండుగగా భావిస్తారు. ఈ రోజున అందించే మిఠాయిలకు ఎంతో ప్రత్యేకత ఉంది. పండుగ సందర్భంగా అందరూ ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. స్వీట్లలో వివిధ రకాల ఉన్నాయి. సాధారణంగా కిలో స్వీట్ ఏదైనా రూ.400-500 వరకు లభిస్తాయి. అయితే మన దేశంలో అత్యంత ఖరీదైన స్వీట్ ఏదో మీకు తెలుసా. అదే 'ఎక్సోటికా'. దీని రుచి, ప్రత్యేకమైన తయారీ పద్ధతి కారణంగా ఎంతో ప్రాచుర్యం పొందింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లఖనవూలోని సదర్ కాంట్‌లో 'ఛప్పన్ భోగ్' పేరుతో ఒక దుకాణం ఉంది. ఈ షాప్ లో మాత్రమే ఈ ఖరీదైన స్వీట్ లభిస్తుంది. ఇంతకు దీని ధర ఎంతనుకుంటున్నారు. అక్షరాలా రూ.56 వేలు. షాక్ అయ్యారా. మీరు విన్నది నిజమే. ఆ డబ్బులతో అర కిలో వెండి లేదా అరతులం బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇంత ఖరీదైనప్పటికీ, ఈ స్వీట్‌కి చాలా డిమాండ్ ఉంటుంది. ఉన్నత వర్గాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ స్వీట్ ని కొనుగోలు చేయకుండా వెళ్లరట.
తయారీ ఎలా..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్స్ ని ఎక్సోటికా స్వీట్స్ తయారీలో వాడుతారు. తయారీ కోసం ఆఫ్ఘనిస్తాన్ నుండి పిస్తాపప్పు, టర్కీ నుండి హాజెల్ నట్స్, ఇరాన్ నుండి మమ్రా బాదం, USA నుండి బ్లూబెర్రీస్, కిన్నౌర్ నుండి పైన్ నట్స్, దక్షిణాఫ్రికా నుండి మకాడమియా గింజలను దిగుమతి చేసుకుంటారు. వీటితోపాటు 24 క్యారెట్ల కొన్ని గ్రాముల బంగారాన్ని కూడా మెత్తగా చేసి అందులో కలుపుతారు.
2009లో ప్రారంభం..
ఒక కేజీ ఎక్సోటికా స్వీట్స్ బాక్స్‌లో 100 ముక్కలు ఉంటాయి. ఒక ముక్క 10 గ్రాముల బరువు ఉంటుంది. 'ఎక్సోటికా' స్వీట్ ని మొదటిసారిగా 2009లో తయారు చేశారు. అప్పటి నుంచి ఈ స్వీట్ డిమాండ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ స్వీట్‌కు ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన స్వీట్ అవార్డు కూడా లభించింది.
ఇవి కూడా చదవండి...
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Read Latet Telangana News And Telugu News
Updated Date - Oct 30 , 2024 | 07:17 PM