Robo Love: రియల్‌గా మారిన రీల్ లైఫ్.. రోబోతో పెళ్లికి సిద్ధమైన భారత ఇంజనీర్
ABN, Publish Date - Apr 28 , 2024 | 03:29 PM
బాలీవుడ్‌లో ఈ ఏడాది ‘తేరి బాతో మే ఐసా ఉల్ఝా జియా’ అనే సినిమా వచ్చింది. అందులో హీరో షాహిద్ కపూర్ రోబో అయిన కృతి సనన్‌తో ప్రేమలో పడతాడు. సరిగ్గా అలాంటి పరిణామమే రియల్ లైఫ్‌లో జరిగింది.
బాలీవుడ్‌లో ఈ ఏడాది ‘తేరి బాతో మే ఐసా ఉల్ఝా జియా’ (Teri Baaton Mein Aisa Uljha Jiya) అనే సినిమా వచ్చింది. అందులో హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) రోబో అయిన కృతి సనన్‌తో (Kriti Sanon) ప్రేమలో పడతాడు. సరిగ్గా అలాంటి పరిణామమే రియల్ లైఫ్‌లో జరిగింది. సినిమా నుంచి ప్రేరణ పొందాడో లేక నిజంగానే అతనిలో ఫీలింగ్స్ పుట్టుకొచ్చాయో తెలీదు కానీ.. భారత్‌కు చెందిన ఓ ఇంజినీర్ ఒక రోబోతో ప్రేమలో పడ్డాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
నాకు చోటు దక్కకపోతే ఆ పని చేస్తా.. శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ వ్యక్తి పేరు సూర్యప్రకాశ్ (Surya Prakash). రాజస్థాన్‌కు చెందిన ఆయన ఒక రోబోటిక్స్ నిపుణుడు. అజ్మీర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పట్టా పొందిన సూర్య.. 2016లో ఇండియన్ నేవీలో సెలక్ట్ అయ్యాడు కానీ, టెక్నికల్ రంగంలో రీసెర్చ్ చేయడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న సూర్య.. త్వరలోనే ‘గిగా’ (Giga) అనే రోబోని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోబో రూ.19 లక్షల ఖర్చుతో తయారవుతోందని, త్వరలోనే సంప్రదాయ పద్ధతిలో దాన్ని పెళ్లి చేసుకోబోతున్నానని సూర్య తెలిపాడు. మొదట్లో ఈ విషయం తెలిసి తన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారని, అయితే ఆ తర్వాత ఒప్పుకున్నారని చెప్పాడు.
ఎలాగైతే మనం కంప్యూటర్లు, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను రెగ్యులర్‌గా వాడుతున్నామో.. అలాగే యంత్రాలతో టెక్నో ఫ్రెండ్లీగా (Techno Friendly) మారడానికి తాను ‘గిగా’ అనే రోబోను వివాహం చేసుకోబోతున్నానని సూర్యప్రకాశ్ వివరించాడు. ఇప్పటికే మార్చి 22వ తేదీన గిగాతో అతని నిశ్చితార్థం జరిగింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గిగాను హోమ్‌మేకర్‌గా మార్చకుండా సూర్య ఆమె కోసం ఒక ఉద్యోగం చూస్తున్నాడు. దీని సేవలను విమానాశ్రయం, రైల్వే స్టేషన్, హోటల్ లేదా ఇతర కంపెనీల్లో పొందవచ్చు. ఇందులో మరెన్నో అప్డేట్స్ జోడిస్తారు కాబట్టి, ‘గిగా’ రోబో మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుందని సూర్య చెప్తున్నాడు.
రిషభ్ పంత్‌కి భారీ ఎదురుదెబ్బ.. ఒక మ్యాచ్ నిషేధం.. ఎందుకంటే?
తమిళనాడు, నోయిడాలకు చెందిన కంపెనీలు ఈ ‘ఎన్‌ఎంఎస్ 5.0 రోబో గిగా’ను (NMS 5.0 Robo Giga) సిద్ధం చేసినట్లు సూర్య పేర్కొన్నాడు. ఆదేశాలు ఇచ్చినప్పుడు.. సెన్సార్ల ఆధారంగా ఈ రోబో అటు-ఇటు కదులుతుంది. దాని మెడ కూడా తిరుగుతుంది. రోజుకి 8 గంటల షిఫ్ట్‌లలో ఈ రోబో పని చేయగలదు. దీనికి దాదాపు 2.5 గంటల పాటు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్ని ఆదేశాలు ఆంగ్లంలో లోడ్ చేయబడ్డాయి. హిందీ ప్రోగ్రామింగ్ కూడా అందులో అప్‌లోడ్ చేసుకోవచ్చని సూర్యప్రకాశ్ చెప్పుకొచ్చాడు.
Read Latest Prathyekam News and Telugu News
Updated Date - Apr 28 , 2024 | 03:29 PM