ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indigo: ఇదేం చోద్యం.. ఇండిగో సిబ్బందితో ప్యాసింజర్‌కు వింత అనుభవం..

ABN, Publish Date - Mar 07 , 2024 | 03:28 PM

ఎక్కడా జరగని వింతలు విశేషాలు ఈ మధ్య ఇండిగో(Indigo) విమానాల్లోనే జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానంలో బుధవారం ఓ వ్యక్తి బీడీ తాగి ప్రయాణికులను ఆందోళనకు గురి చేసిన ఘటన మరువక ముందే.. మరో విచిత్ర అనుభవం ఓ ప్రయాణికురాలికి ఎదురైంది.

ఢిల్లీ: ఎక్కడా జరగని వింతలు విశేషాలు ఈ మధ్య ఇండిగో(Indigo) విమానాల్లోనే జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానంలో బుధవారం ఓ వ్యక్తి బీడీ తాగి ప్రయాణికులను ఆందోళనకు గురి చేసిన ఘటన మరువక ముందే.. మరో విచిత్ర అనుభవం ఓ ప్రయాణికురాలికి ఎదురైంది. బెంగళూరు నుంచి భోపాల్‌కు వెళ్లడానికి ఓ మహిళ విమాన టికెట్ బుక్ చేసుకున్నారు.

ఫ్లైట్ ఎక్కిన కాసేపటికి తన సీటు వంక చూసిన ఆమె షాక్‌కి గురైంది. తన సీటుపై కుషన్ లేకపోవడంతో వెంటనే కుషన్ లేకుండా కూర్చున్న సీటును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎక్స్ వేదికగా తన ఆవేదనను పంచుకుంది. ఆమె పెట్టిన పోస్టు వైరల్ కావడంతో ఇండిగో సిబ్బందిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదంపై స్పందించిన ఇండిగో.. క్లీనింగ్ కోసం కుషన్‌లను మార్చామని, క్యాబిన్ సిబ్బంది కస్టమర్లకు సమాచారం అందించారని చెప్పింది.


"మేడం.. మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. క్లీనింగ్ కోసం విమానంలోని సీటు కుషన్‌లు మార్చారు. సీటు రిజర్వ్ చేసుకున్న వారికి మా సిబ్బంది వెంటనే సమాచారం అందించారు. కస్టమర్లకు పరిశుభత్రతో కూడిన విమాన సేవలు అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం" అని ఎక్స్‌లో ఇండిగో పేర్కొంది.

ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె షేర్ చేసిన పోస్ట్ 10వేలకుపైగా లైక్‌లను పొందింది. మిలియన్‌కిపైగా వ్యూస్ సంపాదించుకుంది. వావ్ మసాజ్ సీట్లు అని ఒకరు కామెంట్ చేయగా, బహుశా మునుపటి ప్రయాణికులు వాటిని తీసుకెళ్లారని మరొకరు వ్యంగ్యంగా స్పందించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 03:34 PM

Advertising
Advertising